BRS MLA Harish Rao On Dairy Farmers: పాడి రైతులకు పెండింగ్లో ఉన్న రూ. 80 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. బీఆర్ఎస్ తరహాలో పక్షం రోజులకోమారు నిధులు విడుదల చేయాలని లేఖలో తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా రైతులు ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతీరోజు పాలు సరఫరా చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము పదిహేను రోజులకోమారు పాడి రైతులకు బిల్లులు చెల్లించేదని గుర్తుకు చేశారు.
Dairy Farmers Issues Telangana : ఒడిదొడుకుల్లో పాడిరైతులు.. ఐదేళ్లయినా అందని ప్రోత్సాహకాలు
BRS MLA Harish Rao Letter To CM On Dairy Farmers Problems : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని అన్నారు. 45 రోజుల పాల బిల్లులు పెండింగులో ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. 45 రోజులకు గాను దాదాపు రూ. 80 కోట్ల రూపాయలు ప్రభుత్వం పాడి రైతులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు.పశువుల కొనుగోలు కోసం చేసిన అప్పుల కిస్తీలు క్రమం తప్పకుండా కట్టుకోవాల్సి ఉందన్న ఆయన పశువులకు దాణా, మీండ్రాల్ మిక్షర్, కాల్షియం, మందులు ఇతరత్రా సామగ్రి కూడా రోజూ కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.