BRS Raithu Deekshalu 2024 : మోసపూరిత వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, మాజీమంత్రి హరీశ్‌రావు(Harish rao) వ్యాఖ్యానించారు. సంగారెడ్డి రైతు దీక్షలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ మొద్దు నిద్రకు నిరసనగానే రైతుదీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎండిన పంటలను కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి,నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో జరిగిన రైతుదీక్షలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పాల్గొన్నారు.
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలి : కేసీఆర్ - KCR Polam Bata Programme
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బీఆర్ఎస్(BRS Deekshalu) కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి క్రికెట్ మ్యాచ్ చూసిన పర్వాలేదు కానీ, రైతుల పరిస్థితి చూసి ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పాత బస్టాండ్ వద్ద రైతుదీక్ష నిర్వహించారు. వరికి మద్దతు ధర, బోనస్ ఇవ్వాలంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సహా భువనగిరిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు.
BRS FIRES ON CONGRESS PARTY :జనగామ జిల్లా పాలకుర్తి దీక్షలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli) పాల్గొన్నారు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దీక్ష చేపట్టారు. వర్ధన్నపేటలో జరిగిన కార్యక్రమంలో మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కరీంనగర్‌లో మాజీమంత్రి గంగుల, వినోద్‌కుమార్ సహా పార్టీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు.