Bonthu Rammohan To Join Congress :బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీకి(BRS Party) గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ముఖ్యమంత్రితో సమావేశం కాగా, తాజాగా ఆ జాబితాలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు.
సీఎం రేవంత్‌ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - అసలేం జరుగుతోంది?
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) శాలువా కప్పి సన్మానించారు. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్, ఇదే విషయమై రేవంత్‌ను కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనబీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరికొంత మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒకట్రెండురోజుల్లో సీఎం కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.
Ex Mayor Bonthu Rammohan Meet CM Revanth Reddy :ఇక ఇప్పటికే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఆ తర్వాత జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవలే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. త్వరలోనే వారు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మహేందర్ రెడ్డి సతీమణి తెలిపారు.