BJP MP Purandeswari About Budget :ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజార్టీతో గెలిపించడమే బీజేపీ లక్ష్యమని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. జేఎన్ రోడ్డు సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి. నాగేంద్ర అధ్యక్షతన బడ్జెట్‌పై సమావేశం అనంతరం ఎన్నికలపై ఎంపీ మాట్లాడారు. ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి చట్టసభకు వెళ్తే పరిష్కారాలను సాధిస్తారని ఓటర్లకు వివరించాలన్నారు. పి. నాగేంద్ర మాట్లాడుతూ ఎంపీ చొరవ వల్ల దివాన్‌చెరువు నుంచి గామన్ వంతెనకు అనుసంధానంగా రూ.326 కోట్లతో పై వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు.
సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రజలందరికీ మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ రూపొందించారని దీనిపై నిర్మాణాత్మక సూచనలొచ్చాయే తప్ప విమర్శలు లేకపోవడమే అందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మహిళలు, రైతులు, యువత, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత్‌భారత్ లక్ష్యంగా నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. స్వయం సహాయక సంఘాల రుణపరిమితిని రూ.20 లక్షలు పెంచడం ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పించారన్నారు.
ఈ నెల27న పట్టభద్రుల ఎన్నిక పోలింగ్ - ఎమ్మెల్సీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!