BJP Leaders Complaint To DGP On TTD Parakamani Scam : తిరుమల వెంకటేశ్వరస్వామి పరకామణి డబ్బు దోచినవారిని వదిలిపెట్టబోమని TTD పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకామణిలో విదేశీ డాలర్లు దోచినవారిపై చర్యలు తీసుకోవాలని DGPకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై TTD ఈవో శ్యామలరావు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పరకామణి దోపిడీలో YSRCP పెద్దల పాత్ర ఉందని భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. పరకామణిలో సుమారు 100 కోట్ల రూపాయలు దోపిడీకి గురైనట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ రహస్య అర అమర్చి తరలించారని తెలిపారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను భానుప్రకాశ్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.
వైఎస్సార్సీపీ హయాంలో శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. హుండీ నుంచి నగదు దొంగిలిస్తూ 2023 ఏప్రిల్ లోనే రవికుమార్ పట్టుబడ్డారని ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా చేశారన్నారు. అయితే కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు నిందితుడ్ని వదిలేశారని ఆక్షేపించారు. పరకామణిలో అక్రమాలపై విచారణ చేసి నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్నానికే ఖాళీ- శ్రీవాణి దర్శన టికెట్లకు భారీ డిమాండ్