Bhuvaneshwari Posted Video of CBN in Assembly on Twitter:సీఎం చంద్రబాబు రెండున్నర సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి స్పందించారు. నేడు గౌరవసభలో 'ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు' అంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఓ వీడియో పోస్ట్ చేశారు. 'నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది' అంటూ ప్రజలకు ప్రణామం అని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో తెలుగువారి ఆత్మగౌరవం గెలిచిందని ఆమె పేర్కొన్నారు. నాడు సభలో చంద్రబాబు శపథం నేడు అదే సభలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టడంపై భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
రెండున్నరేళ్ల తర్వాత సగౌరవంగా గౌరవ సభకు సీఎం చంద్రబాబు - cm chandrababu entered to assembly
వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా కించపరడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. తొలుత అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ‘నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ భువనేశ్వరి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.