Bhadradri Ramaiah Kalyanam Tickets 2024 : భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు సెక్టార్ టికెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. శ్రీరామనవమి రోజు ఉభయ దాతల టికెట్ రుసుము రూ.7,500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు. 18న పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించామని ఈవో రమాదేవి తెలిపారు.
Bhadradri Ramaiah Kalyanam 2024 Dates :వీటిని https:-//bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని ఈవో రమాదేవి పేర్కొన్నారు. ఈ రెండు వేడుకల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు కల్యాణం (Bhadradri Ramaiah Kalyanam) రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటునూ కల్పించామని వివరించారు. దీనికోసం రూ.5000లు, రూ.1116 టికెట్లనూ ఇదే వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని ఈవో రమాదేవి వెల్లడించారు.
అయోధ్య రాఘవుడి ప్రాణప్రతిష్ఠ వేళ - భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు
ఆన్‌లైన్ ద్వారా సెక్టార్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు రామాలయ కార్యాలయం (తానీషా కల్యాణ మండపం)లో తమ ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఈవో రమాదేవి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి భద్రాచలం రామాలయం, గోదావరి బ్రిడ్జి సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, తానీషా కల్యాణ మండపం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లలో నేరుగా టికెట్లను విక్రయించనున్నట్లు ఈవో రమాదేవి పేర్కొన్నారు.