Bhadrachalam Sri Sita Ramachandra Swamy Kalyanam on April 6th 2025 :భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో 2025, ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాములవారి వార్షిక కల్యాణం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్త్రాలను తీసుకొచ్చే సంప్రదాయ వేడుక ఇది. ఆ రోజు చంద్రప్రభ వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తిరువీధి సేవ ఉంటుంది. అదే రోజున శ్రీరామ దీక్షలను భక్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న ఏడాదికి ఒకసారి ఉండే మహా పట్టాభిషేకం చేస్తారు.
భద్రాచలం ఆలయ 2025 వార్షిక క్యాలెండర్‌ను రామాలయం ఈఓ రమాదేవి, ప్రధానార్చకుడు విజయరాఘవన్ బుధవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. 10వేల క్యాలెండర్లను ముద్రించారు. ఒక్కోదాని ధర రూ.120. ఇందులో పండుగలతో పాటు రామాలయంలో విశేషంగా నిర్వహించే ఉత్సవాల వివరాలను పొందుపర్చారు. స్వామివారి వేడుకల చిత్రాలు, అనుబంధ కోవెలలలోని విగ్రహాల చిత్రాలతో క్యాలెండర్ రూపొందించారు. రూ.75 ధరతో రామాలయ డైరీని సైతం ఆవిష్కరించారు.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు - వేణుగానాలంకారంలో భక్తులకు అభయమిచ్చిన స్వామివారు - VONTIMITTA BRAHMOTSAVAM