Best Tourist Places Near Hyderabad: జాబ్ టెన్షన్స్, వ్యాపార లావాదేవీలు, కుటుంబ బాధ్యతలు.. వీటన్నింటిని బ్యాలన్స్ చేయాలంటే వెకేషన్ బెస్ట్ ఆప్షన్. మంచి రిలీఫ్ ఇస్తుంది. కానీ.. ఇప్పుడున్న రోజుల్లో రోజుల తరబడి విహార యాత్రలకు వెళ్లాలంటే కొంచెం కష్టమైన పనే. అందుకే.. హైదరాబాద్ నుంచి ఒక్కరోజులోనే చుట్టొచ్చే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. మీకు నచ్చిన ప్లేస్‌కు వెళ్లి ఎంజాయ్ చేసి రండి..
అనంతగిరి హిల్స్:హైదరాబాద్‌కు అతి దగ్గరగా.. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రాంతం వికారాబాద్. పచ్చగా పరుచుకున్న చెట్లు.. గలగలాపారే సెలయేళ్లు, ఎత్తైన కొండలతో వికారాబాద్ అటవీప్రాంతం రమణీయంగా వుంటుంది. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనంతగిరి హిల్స్. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్‌ను ఇష్టపడేవారు ఈ ప్రాంతంలో బాగా ఎంజాయ్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం రెండు గంటల్లో వికారాబాద్‌కు చేరుకోవచ్చు.
సింగూరు డ్యామ్, మెదక్: హైదరాబాద్‌కు కేవలం 100 కి.మీ లోపే ఈ సింగూరు డ్యామ్ ఉంది. మంజీరా నదిపై నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన ఆనకట్ట ఇది. వర్షాకాలంలో నీటితో నిండి ఉండే ఈ సింగూరు డ్యామ్ పరిసరాలు రమణీయంగా ఉంటాయి. నేచర్ లవర్స్ సింగూరు డ్యామ్ వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు.
యాదగిరిగుట్ట :హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టపై వెలసిన నరసింహ స్వామిని దర్శించుకుని తరిస్తుంటారు భక్తులు. మీరు కూడా వెళ్లాలనుకుంటే ఒక్కరోజులో వెళ్లి రావచ్చు. అంతేకాకుండాయాదగిరి చుట్టుపక్కల భువనగిరి కోట, స్వర్ణగిరి ఆలయం వంటి పలు సందర్శనీయ ప్రదేశాలు కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
బైరాన్‌పల్లి బురుజు - రాణి శంకరమ్మ కోట - మెదక్ జిల్లాలో ది బెస్ట్ షూటింగ్ స్పాట్స్ ఇవే