Barrage Gates Boat Rescue Process Continuing on Third Day : ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ అందర్ని ముప్పుతిప్పలు పెడుతుంది. బోట్లను బయటకు తెచ్చేందుకు మూడ్రోజులుగా అధికారులు, డైవింగ్ టీమ్ ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావటం లేదు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకువచ్చారు. అయినా వారి కృషి ఫలించలేదు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోట్లు కదలటం లేదు. దీంతో మరో భారీ బోటు సాయంతో చిక్కుకున్న బోటును బయటకు లాగేందుకు యత్నించారు.
చివరికి గేటు నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రేన్లు, లిఫ్టులతో బోల్తాపడిన బోటును పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బోట్ల తొలగింపు ప్రక్రియను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. రేపు (శనివారం) బోటుకు బలమైన తాళ్లు, కొక్కేలు కట్టి బయటకు లాగాలని నిర్ణయించారు.
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు - స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశ్ చర్యలు - Telugu Pilgrims Stuck in Kedarnath
ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజూ కొనసాగింది. గేట్ల వద్ద చిక్కుకున్న నాలుగు భారీ పడవలను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రంగంలోకి దిగిన కాకినాడకు చెందిన పడవలను వెలికితీసే నిపుణుడు అబ్బులు నేతృత్వంలోని 14 మంది బృందం భారీ బోట్లు బయటకు లాగే ఏర్పాట్లు చేసింది. ఒక్కొకటి 50 టన్నుల పైగా బరువులాగే 7 భారీ పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు.
వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి - కేంద్ర బృందాన్ని కోరిన సీఎం చంద్రబాబు - Central Team Meet Chandrababu
భారీ పడవలను ఒక దానితో మరోటి అనుసంధానించి చిక్కుకున్న పడవలకు గొలుసులతో కట్టి బయటకు లాగే ప్రయత్నం చేశారు. విశాఖకు చెందిన డైవింగ్ టీంతో ఓ బోటును రెండుగా కోశారు. రెండుగా కోసిన ఆ బోటును తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లనూ భారీ పడవల సాయంతో బయటకు తీయనున్నారు. బ్యారేజీ గోడలకు, గేట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం కూడా కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు.
కాదంబరీ జత్వానీ కేసులో అడ్డంగా దొరికిపోయిన ఐపీఎస్లు - ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్! - Bollywood Actress