Ayodhya Ram Mandir With Rice Grains : ఆయనో ఔత్సాహిక కళాకారుడు. సూక్ష్మకళలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. నమ్ముకున్న కళ అతనికి పేరు తెచ్చింది. ప్రతిభ ఆయనకు బహమతులతో పాటు అవార్డులను మోసుకొచ్చింది. జగిత్యాల పట్టణంలోని తులసినగర్‌కు చెందిన గుర్రం దయాకర్‌కు (Micro artist Gurram Dayakar)చిన్నతనం నుంచే సూక్ష్మ కళలలంటే మక్కువ. దుబాయ్ వెళ్లి వచ్చిన తర్వాత గత ఆరేళ్లుగా ఈ కళపై మరింత దృష్టి సారించారు. ఇప్పటికే అనేక కళాఖండాలను రూపొందించారు.
Rice Grains Ayodhya Ram Mandir :గుండుపిన్నులపై శివలింగం, ఈఫిల్‌టవర్, త్రికూట ఆలయాన్ని చెక్కారు. అలాగే సూది బెజ్జంలో రైతు నాగలి పట్టుకున్నట్లు ఇలా అనేక సూక్ష్మ కళాఖండాలను తీర్చిదాద్దారు. బంగారపు బియ్యపు గింజ మధ్యలో మువ్వన్నెల జెండాను రూపొందించారు. ఆవగింజ పరిమాణంలో బంగారంతో బొజ్జ గణపయ్యను తయారు చేసి ఔరా అనిపించారు. ఆకులపై ప్రముఖుల ముఖ చిత్రాల్ని ఆవిష్కరించారు. అలాగే అతి చిన్నసైజులో ఎలుకల బోను నమూనాను సృష్టించారు. ఇందుకుగాను గిన్నిస్ రికార్డు వరించింది. ఇలా ఎన్నో కళాఖండాలకు జీవం పోసిన తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.
ఇనుము వాడకుండా రామాలయ నిర్మాణం- ఫస్ట్ ఫ్లోర్లో శ్రీరామ దర్బార్- ఆలయ ప్రత్యేకతలివే
Ayodhya Ram Mandir Opening 2024 : తాజాగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని తాను ఒకింత ప్రత్యేకంగా నిలవాలనుకున్నారు. ఉడతా భక్తిగా తన కళనే రాముడికి నివేదించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయత్నం మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశారు. బియ్యపు గింజలతో రామమందిరం (Ayodhya Ram Mandir) ఆకృతిని రూపొందించారు. దాదాపు 16,000ల బియ్యం గింజలతో 60 గంటలపాటు శ్రమించి తయారు చేసినట్లు గుర్రం దయాకర్ తెలిపారు.