At Home Program at Raj Bhavan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన ఆతిథ్య విందు ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు హాజరు కావడంతో అక్కడ రాజకీయ సందడి నెలకొంది.
వీరితో పాటు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మంత్రి నారా లోకేశ్‌తో క్రీడాకారులు: ఎమ్మెల్యేలలో యార్లగడ్డ వెంకటరావు, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సీపీఐ రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్యనేతలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు క్రీడాకారులు అథ్లెట్ వై.జ్యోతి, కోనేరు హంపి తదితరులు హాజరయ్యారు. క్రీడాకారులు మంత్రి నారా లోకేశ్‌తో కొద్దిసేపు మాట్లాడారు. సీఎం చంద్రబాబు దంపతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు సీజే, పవన్ కల్యాణ్ ఒకే చోట కూర్చుని ఆతిథ్యాన్ని స్వీకరించారు.