తెలంగాణ

telangana

'రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు - వినియోగించకపోతే నీకు ఎక్కడిదీ ప్రశ్నించే హక్కు' - Awareness on vote

Warangal Artists Awareness of Vote : దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు ఓటు. మనకు నచ్చినవారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం కల్పిస్తుంది ఓటు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుదాం అంటూ ఓరుగల్లు కళాకారులు పాటల ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు.

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 7:29 PM IST

Published : May 11, 2024, 7:29 PM IST

Awareness on Vote in Warangal
Warangal Artists Awareness of Vote (ETV Bharat)

'రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు - వినియోగించకపోతే నీకు ఎక్కడిదీ ప్రశ్నించే హక్కు' (ETV Bharat)

Awareness on Vote in Warangal :ఓటు విలువ తెలియక చాలా మంది ఓటింగ్​కు దూరంగా ఉంటున్నారు. బాధ్యతను విస్మరిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలేవైనా కావచ్చు. కర్తవ్యాన్ని మరవకూడదు. ఓటు విలువ తెలుసుకుని ఓటు వేయండి అంటూ పాటల రూపంలో చెపుతూ అందరిలో అవగాహన కల్పిస్తున్నారు కళాకారులు. ఓటు అంటే ఆషామాషీ కాదని, అది అందరినీ సరైన మార్గంలో నడిపే రూటే ఓటని కళాకారులు గొంతెత్తి పాడుతున్నారు.

ఓటు ప్రశ్నించే ఆయుధమని, ప్రగతికి బాటలు వేసేదని, చీరా సారెల కోసం ఓటును అమ్ముకోవద్దని అంటున్నారు కళాకారులు. ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని, ఓటర్ల చేతులో ఉన్న ఆయుధమే ఓటు అని, దాని ద్వారా దేశ చరిత్ర మార్చవచ్చని గొంతెత్తి పాడుతున్నారు. ఓటుతో స్వచ్ఛమైన పాలనకు పునాదులు వేయవచ్చని, ఓటుతో మనకు ఉన్న లోటు తీర్చుకోవచ్చని వివరిస్తున్నారు కళాకారులు.

'రాజ్యాంగం ఇచ్చింది ఓటు హక్కును, ఈ దేశ ప్రగతి కోసం వేయాలి ఓటు. ఓటు విలువ తెలుసుకోండి, దాని హక్కును వినియోగించుకోండి. 18 ఏళ్లు నిండి ప్రతి యువతీయువకులు ఓటు హక్కును బాధ్యతగా భావించి వినియోగించుకోవాలి. సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఓటే నీ చేతుల్లో ఆయుధం. నోటుకు ఓటు అమ్ముకోవద్దు'-కళాకారులు

Actor Banerjee on Vote Awareness :అంతేకాకుండా ఓటు విలువపై ప్రముఖుల సైతం అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకోవాలని సినీ నటుడు బెనర్జీ తెలిపారు. కొంతమంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపించడంలేదని, ఇది వ్యవస్థకు ఎంతో చేటు కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడైనా సరే వేయాలని బెనర్జీ కోరారు.

మరోవైపు ఓటు వేయకుంటే నాయకులను ప్రశ్నించే తత్వం బలహీన పడుతుంది అధికారులు సైతం ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు. ఓటు వినియోగించుకుంటే ధైర్యంగా స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నించవచ్చని, ఆయా సమస్యలను నేరుగా వారి దగ్గరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆయా పార్టీలు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే, ఆయా సమస్యలుపై దృష్ట సారించకపోతే ఓటుతోనే సరైనా నాయకుడిని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లేనని వివరిస్తున్నారు. ఒకవేళ ఏ పార్టీకి కూడా ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు అయినా వేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఓటేద్దాం ఛాలెంజ్ చేద్దాం - గత రికార్డులు తిరగరాద్దాం - TS LOK SABHA ELECTION POLLING 2024

మీరు తొలిసారి ఓటు వేస్తున్నారా? అయితే ఈవీఎంలో ఓటు ఎలా పడుతుందో తెలుసుకోండి - How to Cast Vote Using EVM

ABOUT THE AUTHOR

...view details