ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి రవిశంకర్​ కృషి: పవన్‌ కల్యాణ్ - RAVI SHANKAR MET PAWAN KALYAN

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ - పవన్ కల్యాణ్​ను సత్కరించి ఆశీర్వదించిన రవిశంకర్

ravi_shankar_met_pawan_kalyan
ravi_shankar_met_pawan_kalyan (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 8:44 PM IST

Art of Living founder Ravi Shankar met Deputy CM Pawan Kalyan:ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టతకు ప్రాచుర్యం కల్పించడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ ఎంతో కృషి చేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో రవిశంకర్ పవన్ కల్యాణ్​ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆధునిక యోగ ప్రక్రియల్లో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనదని అలాంటి యోగ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రవిశంకర్ అని పవన్ కల్యాణ్ కొనియాడారు.

ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని, అలాంటి ప్రక్రియను పరోక్షంగా తనకు ఉపదేశించారని గుర్తు చేసుకున్నారు. రవిశంకర్ పవన్ కల్యాణ్​ను సత్కరించి ఆశీర్వదించారు. రవి శంకర్​ మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా భక్తి, ముక్తి, యుక్తి, శక్తి అనే నాలుగు నైపుణ్యాలు చాలా అవసరమని అన్నారు. ఆత్మ బలంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం వరిస్తుందని తెలిపారు. పరిపాలనలో రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదని, సంతృప్తి చెందితే ప్రజలకు మేలు జరగడం ఆగిపోతుందని రవిశంకర్ వ్యాఖ్యానించారు.

అమ్మవారి దర్శనం: రవిశంకర్ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో కె ఎస్ రామరావు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. రవిశంకర్ దేవస్థానం నందు రుద్ర పారాయణ చేస్తున్న వేద విద్యార్థులతో ముచ్చటించారు.

గత ఐదేళ్లలో 227 ఎంవోయూలు - పైసా పెట్టుబడి రాలేదు: సీఎం చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా పోసాని, శ్రీరెడ్డిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ABOUT THE AUTHOR

...view details