APSRTC Losses Due to State Bifurcation :రాష్ట్ర విభజనతో అత్యధికంగా నష్టపోయిన సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఉమ్మడి ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా ఇప్పటి వరకు దక్కలేదు. వీటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించాల్సిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా కనీస ప్రయత్నం చేయలేదు. లాభం చేకూర్చకపోగా మరింత నష్టం జరిగేలా వ్యవహరించింది. విభజన సమస్యల పరిష్కారంపై ఎట్టకేలకు రెండు రాష్ట్రాల సీఎంలు జరిపే చర్చలు ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయణికుల్లో తిరిగి ఆశలు రేకెత్తించాయి. చర్చలు సఫలమై సంస్థకు పూర్వ వైభవం దక్కాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటున్నారు.
నష్టాల్లో ఏపీ ఆర్టీసీ :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోట్లాది మంది ప్రయాణికుల ఆదరణతో వేలకోట్ల ఆస్తులను ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) కూడబెట్టుకుంది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీఎస్ఆర్టీసీగా (TSRTC), ఆంధ్రాలో ఏపీఎస్ఆర్టీసీగా సంస్థ విడిపోయింది. విభజన జరిగి పదేళ్లు పూర్తి అయిన ఆస్తి పంపకాలు ఇంకా పూర్తి కాకపోవడం ఏపీఎస్ఆర్టీసీని కష్టాలు పాలు చేసింది. కార్పొరేషన్లు అన్నింటినీ షెడ్యూల్ 9, 10లో చేర్చగా వాటి విభజన ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో సంస్థ ఆర్థికంగా చితికిపోయింది. హైదరాబాద్‌లో విలువైన పలు కీలక ఆస్తుల విభజనలో పీటముడి నెలకొనడం ఎంతకీ పరిష్కారం కాక ఆర్టీసీ పురోభివృద్ధికి ఆటంకంగా మారింది.
ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కసరత్తు - తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానమేనా! - Women Free Bus in AP
ఉమ్మడి ఆస్తుల విలువ :ఏపీఎస్‌ఆర్టీసీ పేరిట ప్రతి జిల్లాలోనూ ఆస్తులు ఉండగా వీటిలో 14 చోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నట్లు గతంలో గుర్తించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ప్రధాన కేంద్ర కార్యాలయం బస్‌భవన్, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి, మియాపూర్‌లోని బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, హకీంపేట, మియాపూర్‌లో ఉన్న బస్ బాడీ యూనిట్ సహా పలు ఖాళీ స్థలాలు, ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా కార్పొరేషన్‌లో తెలిపారు. వీటి విలువ 2014 లోనే వెయ్యి కోట్లు ఉంటుందని లెక్క తేల్చారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలు పంచుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఉద్యోగుల పంపకాలు జరిగినా ఆర్టీసీ సహా పలు కార్పొరేషన్లలో పంపకాలు జరగలేదు.
ఆర్టీసీ వినియోగంలో జగన్ పెత్తందారీబుద్ధి - 40 లక్షల మందికి తుక్కు బస్సులే - Problems In APSRTC Buses
షీలాబేడీ కమిటీ నివేదిక :ఆస్తుల విభజనకు ఆర్టీసీలోని ఈడీల కమిటీ ఏర్పాటు చేసి సయోధ్య దిశగా చర్చించినా ఫలితం లేకుండా పోయింది. సమస్య జఠిలం కావడంతో ఆస్తుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలాబేడీ కమిటీని నియమించింది. ఆర్టీసీలోని ఉమ్మడి ఆస్తుల గుర్తింపుపై అధ్యయనం చేసిన ఈ కమిటీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగులతో చర్చించి ఆమోద యోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుని నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించింది. అనంతరం కేంద్రం సమక్షంలో పంపకాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా జరగలేదు. సానుకూల వాతావరణంలో చర్చించి ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో పంచుకోవాల్సి ఉండగా ఐదేళ్లుగా జగన్ సర్కారు పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వాపోయారు.
"విభజన సమయంలో జరిగినా మార్పులు, చేర్పులు, సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడం శుభ సూచకం. ఆర్టీసీ ఉద్యోగులుగా మేమంతా ఆశాజనకంగా ఉన్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయని ఆశిస్తున్నాం. గత రెండు ప్రభుత్వాలు షీలాబేడీ కమిటీ సూచనలపై సానుకూల నిర్ణయాలు తీసుకుపోవడం వల్ల ఏపీఎస్‌ఆర్టీసీ చాలా నష్టపోయింది" -శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ కార్మిక పరిషత్
సీఎం నమ్మక ద్రోహం - జగన్ దెబ్బకు విలవిల్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు - cm ys jagan cheated rtc employees
వాటా వస్తే సంస్థ పురోభివృద్ధి : ఇరు రాష్ట్రాల చర్చల దృష్ట్యా ఆర్టీసీలోని సమస్యలపై అధికారులు దస్త్రాలను సిద్ధం చేశారు. గత ప్రభుత్వ సాయం లేకపోవడం, సొంతంగా నిధులు లేకపోవడం వల్ల రాష్ట్ర ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయలేకపోయింది. ఉమ్మడి ఆస్తుల్లో వాటా వస్తే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు సానుకూలంగా పరిష్కారమవ్వాలని ఇరు రాష్ట్రాల్లోని ప్రయాణికులు సైతం కోరుకుంటున్నారు.
ఆర్టీసీకి మంచిరోజులు- 1400 బస్సుల కొనుగోలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి - New Busses For Apsrtc