APPSC says Group 2 Mains Exam Cannot be Postponed:ఆదివారం జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనుండగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు 15 నిముషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 92,250 మంది అభ్యర్థుల కోసం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు వందమీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. గ్రూప్-2 పరీక్షపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ హెచ్చరించింది.
ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షలు వాయిదా వేయలేమన్న స్పష్టం చేసింది. ఇప్పుడు పరీక్షలను వాయిదా వేస్తే అభ్యర్థుల మానసికస్థితిపై ప్రభావం చూపిస్తుందన్న వివరించింది. ఈ క్రమంలో గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ఎక్కడా రోస్టర్ పాయింట్‌ల ప్రస్తావన లేద స్పష్టం చేసింది. వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ వెనక కోచింగ్ సెంటర్ల పాత్ర కుడా ఉన్నట్లు తెలుస్తోందని ఏపీపీఎస్సీ ప్రస్థావిచింది. కేవలం నోటిఫికేషన్ను రద్దు చేయించడం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీపీఎస్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.