APPSC Group-1 Mains Exam Dates 2025 :రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిలో 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్‌కి ఎంపిక చేసింది. ఈ పరీక్షలు రాసేందుకు 4496 మంది అభ్యర్థులు అర్హత పొందినట్లు వెల్లడించింది.
2023 డిసెంబర్లో 89 గ్రూప్-1 ఉద్యోగాల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. అయితే వైఎస్సార్సీపీ సర్కార్ ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రిలిమ్స్ నిర్వహించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, మెయిన్స్ పరీక్ష రాసేందుకు తగిన గడువును ఇవ్వాలని కమిషన్ని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.