ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ - అయినవారికే పదవులు - APPSC as YCPSC

APPSC as YCPSC Posts to Party Leaders : జగన్‌ సర్కార్‌ (Jagan Govt) ఏపీపీఎస్​సీ (APPSC) కార్యాలయాన్ని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది. ఆ పార్టీలో పని చేసిన వారికి, ఆ పార్టీతో అంటకాగిన వారికి, సీఎం జగన్‌ (CM Jagan) తో బంధుత్వం ఉన్నవారికి కమిషన్‌ సభ్యత్వ పదవుల (Commission Membership Positions)ను కట్టబెట్టింది. ప్రస్తుతం ఉన్న 8 మంది సభ్యుల్లో ఆరుగురికి అసలు ఉద్యోగ నియామకాలపై అవగాహనే లేదు.

Commission_Membership_Positions_in_APPSC
Commission_Membership_Positions_in_APPSC

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 7:37 AM IST

వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ - అయినవారికే పదవులు

APPSC as YCPSC Posts to Party Leaders: ఏపీపీఎస్​సీని వైసీపీ సర్కారు (YSRCP Govt) ఓ పునరావాస కేంద్రం (Rehabilitation Centre)గా మార్చింది. అయిన వారికి పదవులు కట్టబెడుతోంది. ప్రస్తుతం కమిషన్‌లో ఛైర్మన్‌ కాకుండా 8 మంది సభ్యులు ఉంటే ఇందులో కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున ఉన్నారు. నంద్యాల, అనంతపురం, గుంటూరు, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తానేదో పేటెంట్‌ తీసుకున్నట్లు గొప్పలు చెప్పే సీఎం జగన్‌ వాస్తవంలో ఆ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారు.

బీసీ (BC)లు అధికంగా ఉండే ఆ ప్రాంతానికి చెందిన విద్యావేత్తలకు ఉద్యోగ నియామక కమిషన్‌ పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. పెత్తందారీ పోకడలతో ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూనే మరోపక్క వారిపై ప్రేమ నటించడం జగన్‌కే చెల్లింది. రాష్ట్రంలో 18కిపైగా విశ్వవిద్యాలయాలు (Universities) ఉంటే ఒక్క వర్సిటీకి కూడా ఉపకులపతి (Vice Chancellor)గా ఆ ప్రాంతానికి చెందిన వారిని నియమించలేదు.

సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు - నెలకు ఎన్ని కోట్ల ఖర్చో తెలుసా?

విచిత్రమేమిటంటే ఆ ప్రాంతంలోని వర్సిటీలకు సైతం ఇతర ప్రాంతాల వారినే వీసీ (VC)లుగా నియమించారు. ఉద్యోగ నియామకాల్లో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Andhra Pradesh Public Service Commission)కి ఒక్క సభ్యుడిని సైతం ఆ ప్రాంతం నుంచి నియమించేందుకు జగన్‌కు చేతులు రాలేదు.

ఏపీపీఎస్​సీ నిర్వహించే నియామకాలు తక్కువగా ఉండగా సభ్యుల నియామకాలు మాత్రం చకాచకా జరిగిపోతున్నాయి. వీరిలో రెగ్యులర్‌గా కార్యాలయానికి వచ్చే వారు తక్కువే. నెలకోసారి జరిగే కమిషన్‌ సమావేశంలో మాత్రమే సభ్యులు కనపడుతున్నారు. పలువురు సభ్యులకు ఉద్యోగ నియామకాల (Job Placements) గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ప్రభుత్వ సర్వీస్‌ వ్యవహారాల (Government Service Affairs) గురించి తెలిసిన వారు తక్కువే.

కమిషన్‌లో తీసుకునే నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ సంతకాలు పెట్టేందుకు మాత్రమే వారు పరిమితమౌతున్నారనే విమర్శలున్నాయి. వీరి కోసం పెద్ద ఛాంబర్లు (Chambers), ప్రత్యేక సహాయకులు (Special Assistants) ఉన్నారు. సభ్యుల నియామకాలపై పెట్టిన శ్రద్ధ ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్‌ పెట్టడం లేదు. ఏపీపీఎస్​సీ ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆర్భాట ప్రకటనలు చేసిన జగన్‌ సర్కార్‌ ఆచరణలో దారుణంగా విఫలమైంది.

దళితులపై జగన్ కపట ప్రేమ - చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూనే వెన్నుపోటు

ఉద్యోగ నియామకాల కోసం రాజ్యాంగ బద్ధం (Constitutionally)గా ఏర్పడ్డ కమిషన్‌ నుంచి గడిచిన నాలుగున్నరేళ్లలో కేవలం 2వేల 210 పోస్టుల భర్తీ కోసం 33 నోటిఫికేషన్లు (Job Notifications) మాత్రమే వెలువడ్డాయి. ఇందులో సగం వరకు గత ప్రభుత్వ హయాం (TDP Govt)లో మంజూరైన పోస్టులే ఉన్నాయి. సభ్యులుగా ఉన్నవారంతా వైసీపీ (YCP)కి అనుకూలంగా పనిచేసిన వారే. 2022 ఫిబ్రవరి 19న మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ (Former DGP Gawtam Sawang)ను ప్రభుత్వం ఏపీపీఎస్​సీ ఛైర్మన్‌ (APPSC Chairman)గా నియమించింది.

దీనికంటే ముందు నుంచే సభ్యుల నియామకం చేపట్టింది. 8 మంది సభ్యుల్లో ఐదుగురిని 'సోషల్‌ వర్కర్‌' (Social Worker) కేటగిరీలో నియమించగా ముగ్గురికి ఇన్‌సర్వీస్‌ (Inservice) కేటగిరీలో అవకాశాన్ని కల్పించింది. కమిషన్‌లో సభ్యులుగా ఉండే వారికి ప్రిన్సిపల్‌ సెక్రటరీ (Principal Secretary) హోదాలో ప్రోటోకాల్‌ (Protocol) ఉంటుంది. ఒక్కొక్కరికి వేతనం 2 లక్షలకుపైనే. ఈ హోదాలో ప్రభుత్వపరంగా వచ్చే సదుపాయాల గురించి ఆలోచించే వారే సభ్యుల్లో ఎక్కువగా ఉన్నట్లు విమర్శలున్నాయి.

వైఎస్సార్ జిల్లా సీకేదిన్నె మండలం అంగడివీధికి చెందిన సలాం బాబు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడి (YCP youth Wing President)గా పని చేశారు. వైసీపీకి పని చేసినందుకు అధికారంలోకి రాగానే జగన్‌ ఆయన్ని ఏపీపీఎస్​సీ సభ్యుడి (APPSC Member)గా నియమించి రుణం తీర్చుకున్నారు. అదే జిల్లాకు చెందిన సీవీ శంకర్‌రెడ్డి (CV Shankar Reddy) కేంద్ర పర్యాటక శాఖ (Central Tourism Department)లో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

జగన్ హయాంలో అన్నదాతల అవస్థలు - ప్రభుత్వ నిర్వాకంతో ఏటికేడూ కాడి వదిలేస్తున్న రైతులు

ఈయన సతీమణి తెలంగాణ (Telangana)లో ఐఏఎస్‌ (IAS) అధికారిణి. సీఎం జగన్‌కు సన్నిహితులైన ఓ న్యూరాలజిస్ట్‌ (Neurologist) సిఫార్సుతో కమిషన్‌లో స్థానం కల్పించారు. ఈయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన రమణారెడ్డికి తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థలున్నాయి. కర్నూలు జిల్లాలో గతంలో రెండు విద్యా సంస్థలు నిర్వహించారు. హైదరాబాద్‌లో స్థిరపడటంతో నిర్వహణ నుంచి వైదొలిగారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Minister Buggana Rajendranath Reddy)కి ఈయన అత్యంత సన్నిహితుడు. మరో సభ్యుడైన పీ.సుధీర్‌ సీఎం జగన్‌ తాత రాజారెడ్డి (Raja Reddy) అన్న ప్రభాదాస్‌రెడ్డి మనవడు. ఈయన కర్నూలు జిల్లాలో ఉంటారు. నంద్యాల సమీపంలోని బిల్లలాపూరానికి చెందిన సిద్ధం శ్రీరామ్‌ మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో నంద్యాల మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ (Market Committee Chairman)గా, యువజన కాంగ్రెస్‌(Youth Congress) నగర అధ్యక్షుడిగా పని చేశారు.

నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్‌రెడ్డి (MLA Ravi Chandra kishor Reddy)తో ప్రస్తుతం సన్నిహితంగా ఉంటున్నారు. ఈ పరిచయాలతో ఆయన ఏపీపీఎస్​సీలో సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని ఊరుచింతలకు చెందిన డాక్టర్‌ జీవీ సుధాకర్‌రెడ్డి (GV Sudhakar Reddy) ఎల్‌ఐసీ (LIC)లో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (Development Officer)గా పనిచేస్తూ కదిరిలోనే స్థిరపడ్డారు. వైసీపీ ఆవిర్భావంతో ఆయన ఉద్యోగం వదిలేసి ఆ పార్టీలోకి వెళ్లారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసేవారు.

వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్​సీ సభ్యుడిగా పదవి కట్టబెట్టింది. గుంటూరుకు చెందిన బీ.ఎస్‌.సెలీనా ఉన్నత విద్యా మండలి కార్యాలయం (Higher Education Council Office)లో అకడమిక్‌ ఆఫీసర్‌ (Academic Officer)గా ఉన్నారు. సీఎంతో సన్నిహితంగా ఉండే వారు చేసిన సిఫార్సు మేరకు ఈమె కమిషన్‌ సభ్యులయ్యారు. కాకినాడ జిల్లా తునిలో సోనీవుడ్‌ నాసా స్వచ్ఛంద సేవా సంస్థ (NASA Charity) నిర్వహిస్తున్నారు. క్రైస్తవ ప్రచార సభలు సైతం నిర్వహిస్తారు. ఐపీఎస్‌ సునీల్‌ కుమార్‌ (IPS Sunil Kumar) ఈయనకు మావయ్య. జగన్‌ పాదయాత్రలో ఏర్పడిన పరిచయం సోనీవుడ్‌కు కమిషన్‌లో అవకాశం వచ్చేలా చేసింది.

సీఎం జగన్‌ కులాల మధ్య చిచ్చుపెడుతూ కొత్త నాటకానికి తెరతీశారు: నాగుల్‌మీరా

ABOUT THE AUTHOR

...view details