Appointment of Cabinet Sub Committee on New Liquor Policy in AP:రాష్ట్రంలో నూతన మద్యం విధానం రూపకల్పనకు ప్రభుత్వం మంత్రివర్గ సబ్‌కమిటీని నియమించింది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కెబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవిలను నియమించారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని కెబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేయనుంది. మద్యం దుకాణాలు, బార్లు, బెవరేజెస్ కంపెనీల వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను పరిశీలించనుంది. మద్యం విధాన రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి మంత్రి వర్గ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించనుంది.