CM Chandrababu Polavaram Tour : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు శనివారం పరిశీలించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ లు ఏర్పాట్లను సమీక్షించి ఆయా శాఖల సిబ్బందికి తగు సూచనలు చేశారు. పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు. హెలిపాడ్ నుంచి ప్రాజెక్ట్ పనుల ప్రాంతాల వరకు సీఎం వెళ్లే అవకాశమున్నచోట్ల వరకు సీఎం కాన్వాయ్ ట్రైన్ రన్‌ను అధికారులు నిర్వహించారు. ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు కలెక్టరు, ఎస్పీలు తెలిపారు. అక్కడే ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూపొందించిన వర్క్ షెడ్యూల్‌ను సీఎం ప్రకటించనున్నారు.
Minister Nimmala RamaNaidu on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్, హంద్రినీవతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ పాలసీలపై ఈ నెల 3న సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులపై షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్, హంద్రినీవతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ పాలసీలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి, అక్కడే షెడ్యూల్ విడుదల చేసేలా సన్నాహాలు చేయాలని సీఎం సూచించారని వివరించారు. షెడ్యూల్ ప్రకారం ఒక్క రోజు కూడా తేడా లేకుండా పనులు జరగాలని సీఎం ఆదేశించారని నిమ్మల అన్నారు. ఐదేళ్ల విధ్వంస పాలన నుంచి తిరిగి పోలవరం పనులను పునఃప్రారంభిస్తున్నామని మంత్రి వివరించారు.
ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పోలవరం పనులు చేపట్టాలని సీఎం సూచించారని మంత్రి తెలిపారు. జనవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. పోలవరం పునరావాస పనులు కూడా త్వరలోనే చేపడతామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణం, భూసేకరణ తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించి, పోలవరం సకాలంలో పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీసుకెళ్తామని మంత్రి నిమ్మల వెల్లడించారు. రాయలసీమ సాగు, తాగు నీరు అందించేందుకు హంద్రీనీవ కాలువ సామర్థ్యం పెంచేలా లైనింగ్, వైండనింగ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
రెండో వారంలో పోలవరానికి సీఎం చంద్రబాబు - పనుల షెడ్యూల్ ప్రకటన
ఆ మూడు విషయాల్లో 'జీరో' ప్రగతి - వైఎస్సార్సీపీ హయాంలో పోలవరం పురోగతిపై కేంద్రం