ETV Bharat / state

పీజీ వైద్య విద్య కళాశాలలకు ఒకే తరహా ఫీజులు తగదు - జీవో 56 రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం - AP HIGH COURT CANCELS GO 56

పీజీ వైద్య విద్య ఫీజులపై గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 56 - ఆ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం

AP High Court Cancels GO 56
AP High Court Cancels GO 56 (ETV Bhart)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

AP High Court Cancels GO 56 : ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్య కోర్సులకు ఫీజులను ఖరారు చేస్తూ గత ప్రభుత్వం తెచ్చిన జీవో 56ను హైకోర్టు రద్దు చేసింది. రెండు నెలలో ఫీజులను నిర్ణయించాలని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఆదేశించింది. కళాశాలలు కోరినట్లుగా ఫీజులను నిర్ణయించేందుకు కమిషన్‌ అంగీకరించకపోతే తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు యాజమాన్యాల అభిప్రాయం సేకరించాలని కమిషన్‌కు స్పష్టం చేసింది. ఒకవేళ ఫీజును పెంచితే ఆ సొమ్మును పీజీ వైద్య విద్యార్థుల నుంచి రాబట్టుకునేందుకు కళాశాలలకు వెసులుబాటు ఇచ్చింది. కోర్సు పూర్తి చేసినప్పటికీఆ పెరిగిన ఫీజును విద్యార్థులు చెల్లించాలని పేర్కొంది.

AP High Court Judgment on GO 56 : 2020-21 నుంచి 2022-23కి ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల ఫీజుల్ని ఖరారు చేస్తూ గత ప్రభుత్వం 2020 మే 29న జీవో 56 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ పలు ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. క్లినికల్‌ డిగ్రీ కన్వీనర్‌ కోటా సీటుకు 4.32లక్షలు, మేనేజ్‌మెంట్‌ కోటా సీటుకు 8.64లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు 50లక్షలు నిర్ణయించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అన్ని కళాశాలలకు ఒకే తరహా ఫీజుల ఖరారు తగదన్నారు. ఖర్చులు, మౌలిక వసతులు వంటి విషయాల్లో కళాశాలలు సమర్పించిన వివరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా APHERMC ఫీజుల్ని నిర్ణయించిందన్నారు. 2017-18 నుంచి 2019-20 సంవత్సరానికి కన్వీనర్‌ కోటా క్లినికల్‌ డిగ్రీ సీటు ఫీజు 6.90లక్షలుగా ఉండేదని, 2020-21 నుంచి 2022-23కి కన్వీనర్‌ కోటా సీటు ఫీజు 4.32లక్షలుగా నిర్ణయించరని ఆ జీవోను రద్దు చేయాలని కోరారు.

మరిన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు - సీటు ఫ్రీ!

ఫీజు పెంపు కోసం ప్రతిపాదన చేస్తూ కళాశాలలు అందజేసిన వివరాలను కమిషన్‌ ఏవిధంగా పరిగణనలోకి తీసుకుందో తమ ముందు వివరాలు లేవని ధర్మాసనం పేర్కొంది. కమిషన్‌ సక్రమంగా పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. యూనిఫాం ఫీజు నిర్ణయం కొంతమంది విద్యార్థులకు నష్టం చేస్తుందని తెలిపింది. కళాశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా, కమిషన్‌ నిర్ణయించిన ఫీజును వసూలు చేసుకునే అర్హత లేకపోయినా, ఒకే తరహా ఫీజును చెల్లించడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుందని తెలిపింది. ఉత్తమ మౌలిక సదుపాయాలు, మంచి బోధన సిబ్బంది ఉన్న కళాశాలల విషయంలో యూనిఫాం ఫీజును నిర్ణయిస్తే వాటి పరిస్థితి ఏమిటనేది కమిషన్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది.

ఫీజులను నిర్ణయించే క్రమంలో కళాశాలలు లాభార్జనకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని గుర్తు చేసింది. అన్ని కళాశాలలకు కమిషనన్‌ ఒకే తరహా ఫీజులు నిర్ణయించడం వల్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించకూడదని యాజమాన్యాలు నిర్ణయించాయని తెలిపింది. కోర్టు వెలుపల విద్యార్థులు, విద్యా సంస్థలు మాట్లాడుకొని కమిషన్‌ నిర్ణయించిన ఫీజు కంటే ఏడాదికి మరో 45 వేలు అదనంగా చెల్లించేందుకు నిర్ణయించారంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని జీవో 56ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. రెండు నెలల్లో ఫీజును నిర్ణయించాలని కమిషన్ను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈనెల 12న తీర్పు ఇచ్చింది.

Prathidwani: వైద్య విద్యలో ఫీజుల భారం.. సుప్రీం తీర్పుతో పరిస్థితి మారుతుందా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.