AP Pregnant Woman Gave Birth to Child in Flight: ఇండిగో ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ విమానం 179 మంది ప్రయాణికులతో సింగపూర్ నుంచి బయలుదేరి చెన్నైకి పయనమైంది. ఈ ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో ఎగురుతోంది. ఈ సమయంలో విమానంలో కుటుంబంతో సహా ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన దీప్తి సరిసు వీర వెంకటరామన్ (28)కి అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.
విమానం గాలిలో ఉండగానే జననం : అప్రమత్తమైన దీప్తి కుటుంబ సభ్యులు విమాన సిబ్బందికి సమాచారం అందించారు. విమాన సిబ్బంది చీఫ్ పైలట్‌కు సమాచారం అందించడంతో పైలట్ వెంటనే చెన్నై ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మగవారిని మరొక ప్రదేశానికి మార్చారు. నిమిషాల్లోనే విమాన సిబ్బంది ప్రసవానికి తగిన ఏర్పాట్లు చేశారు. విమానం గాలిలో ఉండగానే దీప్తి పండంటి అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. మహిళా డాక్టర్, విమానంలోని మహిళా ప్రయాణికులు దీప్తి సుఖ ప్రసవానికి అన్ని విధాలా చర్యలు తీసుకున్నారు.
ప్రాణం కోసం యుద్ధం- మృతిచెందిన తల్లికి ఆపరేషన్ చేసి పసికందుకు జననం- అనాథగా నెలలు నిండని శిశువు - Palestinian Baby Is Born As Orphan
సిద్ధంగా ఉన్న ఎయిర్‌పోర్ట్ మెడికల్ సిబ్బంది : విమానంలో గర్భిణిని, ఆమె బిడ్డను రక్షించడానికి విమాన సిబ్బంది, సహాయకులు శరవేగంగా చర్యలు తీసుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు వారిని అభినందిచారు. అలాగే ప్రశంశలు అందుకున్నారు. ఈ స్థితిలో ఈ ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కాగా, పైలట్ అప్పటికే చెన్నై ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వడంతో, విమానం ల్యాండ్ అయ్యే సమయానికి రన్‌వే వద్ద ఎయిర్‌పోర్ట్ మెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యింది. వెంటనే వైద్య బృందం విమానం లోపలికి వెళ్లి తల్లీబిడ్డలను పరీక్షించింది. తల్లీబిడ్డలను విమానంలో నుంచి వారిని బయటకు తీసుకువచ్చి అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత విమానంలోని ఇతర ప్రయాణికులను విమానం దిగేందుకు అనుమతించారు. దీప్తి తన కుటుంబంతో కలిసి సింగపూర్ నుంచి టూరిస్టుగా తిరిగి వస్తుండగా ఈ ఘటన జరగడం గమనార్హం.
ప్రాణప్రతిష్ఠ వేళ పెద్ద ఎత్తున ప్రసవాలు- పట్నాలోనే 500మంది జననం- ముస్లిం బిడ్డకు రామ్ రహీమ్‌గా నామకరణం
అసాధారణ రీతిలో ఆకాశంలో పుట్టిన ఆ బిడ్డ బర్త్ సర్టిఫికెట్, పౌరసత్వంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, చట్టప్రకారమే అన్ని జరుగుతాయని అధికారులు అంటున్నారు.