AP Pension Distribution Issue: పెన్షన్లు నగదు బదిలీ పథకాల పంపిణీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఏపీ అధికారులు వక్రీకరించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాలంటీర్ల బదులు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచిస్తే సెర్ప్ (Society for Elimination of Rural Poverty) సీఈఓ మాత్రం గ్రామ వార్డు సచివాలయంకే లబ్ధిదారులు రావాలనీ ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది.
పెన్షన్ తీసుకునేందుకు లబ్ధిదారులు కార్యాలయాలకు రావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పిన రెండు గంటలకే ఆ తరహా ఉత్తర్వులు సెర్ప్ సీఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడం ఆరోపణలకు తావిస్తోంది. ఈ మేరకు సెర్ప్ సీఈఓ మురళిధర్ రెడ్డి (SERP CEO Muralidhar Reddy) స్వామి భక్తి చాటుకున్నట్టు స్పష్టం అవుతోంది. నగదు బదిలీ పథకంగా భావించి పెన్షన్ను వాలంటీర్లు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పంపిణీ కోసం వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టంగా సూచనలు చేసింది.
అయినప్పటికీ ఆ తరహాలో నిర్ణయం కాకుండా లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగేలా సెర్ప్ సీఈఓ మురళిధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వృద్ధాప్య, దివ్యాంగ, ఒంటరి మహిళలు, ఇతర లబ్ధిదారులను ఇబ్బంది పెట్టేలా సెర్ప్ సీఈఓ ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదం అవుతోంది. అసలు దివ్యాంగులు, నడవలేని వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాలకు ఎలా వస్తారన్న కనీస అవగాహన లేకుండా ఈ ఆదేశాలు ఇవ్వడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి.
పింఛన్ల నిధులను బిల్లులకు చెల్లించారు- పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షంపై విషప్రచారం: టీడీపీ నేతలు - pension distribution in ap
ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేలా, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలా ఈ తరహా ఉత్తర్వులు సెర్ప్ సీఈఓ జారీ చేయడంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పెన్షన్ లబ్ధిదారుల గృహాలకు వెళ్లి ఇచ్చే అవకాశం ఉన్నా సేర్ప్ సీఈఓ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న అంశంపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
Jasti Veeranjaneyulu On Pension Distribution Issue: రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్లను పంచాయతీ, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని ఏపీ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు సూచించారు. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న కేంద్ర ఎన్నికల నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
అయితే సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతి సచివాలయం పరిధిలో 8 మందికిపైగా సిబ్బంది ఉన్నారని అలాగే 30 వేలకు మందికి పైగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఉన్నారని, వారి ద్వారా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయవచ్చని సూచించారు. వేసవిలో వృద్ధులు , దివ్యాంగులు, మహిళలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
పింఛన్ల పంపిణీపై సెర్ప్ కీలక ఉత్తర్వులు- కోడ్ ముగిసేవరకు ఇంటింటికీ ఉండదు - SERP orders on AP pensions