Peddavagu Overflowed Due to Heavy Rain in Vijayawada: భారీ వర్షానికి విజయవాడలోని నున్న సమీపంలోని పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వికాస్ కాలేజీ సమీపంలో పెద్దవాగు పొంది రోడ్డుపై 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 100 మంది కాలేజీ విద్యార్థులు, పొలాలకు వెళ్లిన 50 మంది రైతులు చిక్కుకుపోయారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 24 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Tue Sep 24 2024- విజయవాడ సమీపంలో పొంగిన పెద్దవాగు - చిక్కుకున్న 150 మంది విద్యార్థులు, రైతులు - VIJAYAWADA PEDDAVAGU OVERFLOWED

By Andhra Pradesh Live News Desk
Published : Sep 24, 2024, 8:00 AM IST
|Updated : Sep 24, 2024, 9:24 PM IST
విజయవాడ సమీపంలో పొంగిన పెద్దవాగు - చిక్కుకున్న 150 మంది విద్యార్థులు, రైతులు - VIJAYAWADA PEDDAVAGU OVERFLOWED
రేపే వరద సాయం - 4 లక్షల మందికి రూ.597 కోట్లు అందజేత - Finance Assistance to Flood Victims
Finance Assistance to Flood Victims in AP: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వరద నష్టం అంచనాలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి, విజయవాడలో లక్షన్నర మంది బాధితులకు వరద సాయం అందించనుంది. దాదాపు రూ.597 కోట్లను ప్రభుత్వం బాధితులకు అందజేయనుంది. | Read More
పెళ్లి చూపుల కోసం మేనత్త ఇంటికి వచ్చి బంగారంపై కన్నేసిన అల్లుడు - చివరకు ఏమైందంటే! - Son in Law Robbery at Aunt House
Son-in-Law Robbery at Aunt House in Manyam District: పెళ్లి చూపుల కోసమని వచ్చి ఏకంగా మేనత్త ఇంట్లోనే దోపిడీ చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగి చాలా రోజులు అయినా నిందుతుడు అరెస్టు కావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ మీడియా సమావేసం ద్వారా వెల్లడించారు. | Read More
తిరుమలలో సాధువుల నిరసన- గత పాలకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ - Swamiji Agitation in Tirupati
Swamiji Agitation in Tirupati on Laddu Issue : తిరుమల లడ్డూ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీవారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. గత వైఎస్సార్సీపీ పాలకులు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. | Read More
తిరుమల లడ్డూ వ్యవహారం - సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి - Sarva Sreshta Tripathi as SIT Chief
SIT Chief Appointed: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. ప్రస్తుతం సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు. | Read More
రాష్ట్రంలో 3,736 మద్యం షాపులు - రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ - New Liquor Shops Notification
New Liquor Shops Notification in AP: త్వరలో రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల నొటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు ప్రభుత్వం రిజర్వ్ చేయనుంది. | Read More
హైదరాబాద్‌లో వరుణుడి ప్రతాపం - మరో 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం! - RAINS IN HYDERABAD
Weather Update : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వరుణుడు పలకరించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 గంటల్లో నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. | Read More
రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు - ప్రాజెక్ట్ సిద్ధం చేయాలి: సీఎం చంద్రబాబు - CHANDRABABU VISITED RTGS
CM Chandrababu Visited Real Time Governance Center in Secretariat : వైఎస్సార్సీపీ హయాంలో రియల్‌టైం గవర్నెన్స్‌ను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారని గతంలో కూటమి నేతలు ధ్వజమెత్తారు. నేడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలను మెరుగుపరుస్తున్నారు. | Read More
జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ బుధవారానికి వాయిదా - Jani Master Verdict Posteponed
Jani Master Verdict Posteponed for Wednesday : మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రంగారెడ్డి కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై కూడా బుధవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. | Read More
తిరుమల లడ్డూ వివాదం - పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్ రాజ్ - Prakash Raj Tweet to Pawan Kalyan
Cine Actor Prakash Raj Tweet to Dy CM Pawan Kalyan: సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండని పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా మాట్లాడారు. | Read More
ఓటుకు నోటు కేసు - అక్టోబర్ 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం - CM Revanth In Vote For Note Case
CM REVANTH IN VOTE FOR NOTE CASE : ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో, ఈనెల 16న విచారణకు హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరగ్గా మత్తయ్య మినహా మిగిలిన నిందితులు గైర్హాజరయ్యారు. ఈ దశలో ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు, వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. | Read More
రాములవారి రథానికి నిప్పు - పోలీసుల దర్యాప్తు ముమ్మరం - గ్రామ కక్షలే కారణమా? - Chariot Fire In Anantapur District
Chariot Fire In Anantapur District : అనంతపురం జిల్లాలో హనకనహాల్‌లో అర్ధరాత్రి రాములవారి రథానికి నిప్పంటించి దుండగులు పరారయ్యారు. మంటలు గుర్తించి గ్రామస్తులు వాటిని అదుపుచేసే లోపే సగం రథం కాలిపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | Read More
ఏపీలో బుల్డోజర్ల హవా - మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం - Demolition Houses in Machilipatnam
Demolition Houses in Machilipatnam : మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే మడుగు పోరంబోకు భూమిలో నిర్మించిన ఇండ్ల కూల్చివేత పనులను చేపట్టింది. మరోవైపు ఇళ్ల కూల్చివేతపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. | Read More
బుల్డోజర్లకు పని చెప్పిన అధికారులు - కాకినాడలో అక్రమ కట్టడాల కూల్చివేత - Demolish Illegal Construction in AP
Demolish Illegal Construction in Kakinada: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదం. అదే పంథాలో కాకినాడలో సైతం కొనసాగింది. ప్రభుత్వ స్థలాల కబ్జా, అక్రమ కట్టడాలు, బినామీ గుత్తేదారుల ముసుగులో అడ్డగోలు పనులు, సెటిల్‌మెంట్లు, మడ అడవుల విధ్వంసం. ఇలా ఎన్నో. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడలోని సంతచెరువు వద్ద డ్రెయిన్‌పై అక్రమంగా నిర్మించిన 4 దుకాణాలను నగరపాలక సంస్థకూల్చి వేసింది. | Read More
రాజమహేంద్రవరంలో బుల్డోజర్లు - 21 ప్రాంతాల్లో 128 అక్రమ కట్టడాలే టార్లెట్ - Encroachments in Rajamahendravaram
Encroachments in Rajamahendravaram : వైఎస్సార్సీపీ పాలనలో రాజమహేంద్రవరంలో అడుగడుగునా కబ్జాల పర్వం కొనసాగింది. అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకొని నేతలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా డబ్బులు దండుకున్నారు. తాజాగా అధికారులు వీటిపై ఫోకస్ పెట్టారు. నెలరోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ చేపట్టారు. | Read More
ప్రత్యర్థులకు సాయం చేశాడని పట్టపగలు హత్యాయత్నం - అనంతపురం జిల్లాలో దారుణం - Opponents Attack Family in Guntakal
Opponents Attack on Family in Guntakal : గుంతకల్లులో పట్టపగలే ఓ కుటుంబంపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. | Read More
ఏడుగురు మిత్రులను సన్మానించిన వెంకయ్య నాయుడు- అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ - Venkaiah Naidu Honors Seven Friends
Venkaiah Naidu Honors Seven Friends in Visakha : ఎటువంటి హద్దులు లేని స్నేహం జీవితాంతం గుర్తు ఉంటుంది. అలాంటి స్నేహితులు 70 ఏళ్లు దాటిన అనంతరం ఓ చోట కలుసుకున్న అపూర్వ ఘటం విశాఖలో జరిగింది. తన ఏడుగురు మిత్రులకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కారం చేశారు. | Read More
ఈఫిల్ టవర్ తరహాలో ‘ఒబిలిస్క్ టవర్’- యానాంలో పడకేసిన పర్యాటక ప్రాజెక్టు - Yanam Obelisk Tower
Government Neglect Yanam Obelisk Tower : ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నమూనాతో నిర్మించిన ‘యానాం ఒబిలిస్క్ టవర్’ సరైన నిర్వహణ, ప్రణాళిక లేక పడకేసింది. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ టవర్ వద్దకు సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో పర్యాటకులు ఆసక్తి చూపించడంలేదు. | Read More
పోస్టింగులు, రాజకీయ ప్రాపకం కోసం - ముంబై నటిపై ఫోర్జరీ పత్రంతో కేసు - Mumbai Actress Case
IPS Officers Anarchy In Mumbai Actress Case: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ ఉన్నతాధికారులే వైఎస్సార్సీపీ పాలనలో రాజకీయ ప్రాపకం కోసం దారితప్పారు. పోస్టింగ్‌ల కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో ఓ మహిళపై అన్యాయంగా కేసు బనాయించారు. వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్‌తో కుమ్మక్కై కుట్రకు పాల్పడ్డారు. నకిలీ ధ్రువపత్రాలను అసలు రికార్డులుగా న్యాయస్థానాన్నీ నమ్మించారు. కుట్రలో ఐదుగురు పోలీస్ అధికారులు సూత్రధారులుగా విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో విచారణ అధికారులు వెల్లడించారు. | Read More
సనాతన ధర్మం జోలికొస్తే ఖబడ్దార్ : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Visits Indrakeeladri
Pawan Kalyan Prayaschitta Diksha: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్ కల్యాణ్ శుభ్రం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని పవన్ కల్యాణ్ అన్నారు. | Read More
ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్ అందాలి - విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం - Chandrababu Review on Pensions
Chandrababu Review on Pensions : రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హులు స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని పిలుపునిచ్చారు. తప్పుడు ధ్రువపత్రాలతో కొంతమంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందడం సరికాదన్నారు. ఇది వారికి అన్యాయం చేయడమేనని చెప్పారు. ఇలాంటి వాటిని గుర్తించి అనర్హులని ఏరివేసి, అర్హులకే పింఛన్ ఇచ్చేలా గ్రామ సభల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. విశాఖలో 30 ఎకరాల్లో రూ.200 కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. | Read More
ఏపీలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు - 2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు - Lokesh Review On Education
Minister Nara Lokesh Review On Education Officials : రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. | Read More
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ - నేడు అధికారిక ఉత్తర్వులు? - SIT on Tirumala Laddu Controversy
SIT To Investigate Tirumala Laddu Controversy?: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘావిభాగాధిపతి మహేష్ చంద్ర లడ్హాలతో సీఎం చర్చించినట్లు సమాచారం. | Read More
వైఎస్సార్సీపీ సర్పంచ్ భర్త నిర్వాకం - అధికారం అండతో అడ్డగోలుగా దోపిడీ - YSRCP Sarpanch Husband extortion
YSRCP Sarpanch Husband People Misappropriation of Funds in Eluru District : గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సాగించిన నిధుల దుర్వినియోగం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఏలూరు జిల్లా ఓ పంచాయతీలో ప్రభుత్వ అధికారిని అడ్డం పెట్టుకుని సర్పంచ్ భర్త దోచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఓ సామాజిక కార్యకర్త ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. | Read More
ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు వైఎస్సార్సీపీ బ్రేక్ -ఎన్డీఏ ప్రభుత్వంపైనే అన్నదాతల కోటి ఆశలు - YSRCP Govt on Offshore Project
YSRCP Government Careless on Offshore Project: వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల్లో ఆఫ్‌షోర్ కూడా ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం అటకెక్కించింది. ప్రాజెక్టు వస్తే తలరాతలు మారతాయని ఎదురుచూసిన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల్లేక నిర్వాసితులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వమే ఆఫ్‌షోర్ బాధ్యతని తీసుకోవాలని రైతులు, నిర్వాసితులు కోరుతున్నారు. | Read More
భవానీ ద్వీపానికి వరద దెబ్బ - కళావిహీనంగా మారిన పరిసరాలు - Bhavani Island Damaged in Floods
Bhavani Island Damaged in Floods : ఎటు చూసినా కనుచూపు మేర కృష్ణమ్మ ప్రవాహం. చల్లని చూపుతో లోకాలను పాలించే దుర్గమ్మ ఓ వైపు. కృష్ణవేణికి వడ్డానంలా కనిపించే ప్రకాశం బ్యారేజీ మరోవైపు. నదీ గర్భంలో 600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా నిర్మితమైన అత్యద్భుత ప్రదేశమే భవానీ ద్వీపం. ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడుతూ ఉండే ఈ ప్రదేశమంతా ఇప్పుడు వరదల వల్ల కళావిహీనంగా మారింది. ఇప్పటివరకు ఈ ప్రాంతాన్ని చూసి వావ్ అన్నవారే ఇప్పుడు అయ్యో అనే స్థితికి చేరింది. | Read More