SIT Inquiry Adulteration Ghee Case : తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. తిరుపతి పోలీసు అతిథిగృహంలో రెండోరోజు సమావేశమైన సిట్ అధికారులు విచారణ విధివిధానాలను రూపొందించారు. మూడు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించే అంశంపై చర్చించారు. కల్తీ నెయ్యి ఘటనలో పాత్రధారులు, సూత్రధారులను గుర్తించడానికి లోతైన దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అనంతరం టీటీడీ ఈవోతో సమావేశమయ్యారు. నెయ్యి కొనుగోలు, లడ్డూ తయారీతో ప్రమేయం ఉన్న టీటీడీ ఉద్యోగులను పోలీసు అతిథిగృహానికి పిలిపించి వివరాలు సేకరించారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 29 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sun Sep 29 2024- పాత్రధారులు, సూత్రధారులను గుర్తించే పనిలో సిట్ - రెండో రోజు మరిన్ని వివరాలు సేకరణ - SIT Inquiry Adulteration Ghee Case
By Andhra Pradesh Live News Desk
Published : Sep 29, 2024, 7:00 AM IST
|Updated : Sep 29, 2024, 10:57 PM IST
పాత్రధారులు, సూత్రధారులను గుర్తించే పనిలో సిట్ - రెండో రోజు మరిన్ని వివరాలు సేకరణ - SIT Inquiry Adulteration Ghee Case
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు - Two people died at road accident
Two people died at road accident in Bapatla district : బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును టాటాఏస్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రేపల్లె మండలం పెనుమూడి వంతెనపై జరిగింది. | Read More
'గోవు ఘోష విను గోవిందా' పేరిట బీజేపీ వినూత్న నిరసనలు - BJP Kisan Morcha Fire on YSRCP
BJP Kisan Morcha Cleaning Temples due to Tirumala Laddu Issue : 'గోవు ఘోష విను గోవిందా' పేరిట బీజేపీ కిసాన్‌మోర్చా గోమాత పూజలు చేపట్టింది. వైఎస్సార్సీపీ నేతలు వెళ్లిన దేవాలయాలను వారు పునఃశుద్ధి చేశారు. వైఎస్సార్సీపీ నేతలు లడ్డూను అపవిత్రం చేసిందే కాక తప్పును కప్పిపుచ్చుకునేందుకు దేవాలయాలకు వచ్చి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. | Read More
పండుగలకు చేనేత వస్త్రాలనే దరిద్దాం- భువనశ్వేరి పిలుపు ఒకే అన్న మహిళా మంత్రులు - Bhuvaneshwari on Handloom Clothes
Minister Savitha Thanks to Nara Bhuvaneshwari : రానున్న పండుగలకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేద్దామని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తద్వాపా నేతన్నలకు అండగా నిలబడదామని ఆమె చెప్పారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి సవిత భువనేశ్వరికి కృతజ్ఞతలు తెలియజేశారు. | Read More
కొత్త సిటీలోకి మెట్రోరైలు- రెండో దశ డీపీఆర్‌కు తుదిమెరుగులు - HYDERABAD METRO PHASE 2 DPR
Hyderabad Metro Phase 2 DPR : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మలిదశ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తసిటీలోకి మెట్రో రైలు వెళ్ళేలా ప్రణాళికలు రూపొందించారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు | Read More
వైఎస్సార్సీపీ గుప్పిట్లో సాగర తీరం - నిబంధనలకు పాతరేస్తూ అక్రమ నిర్మాణాలు - YSRCP Irregularities Visakhapatnam
Illegal Constructions Visakha CRZ Area : గత ఐదేళ్లూ సాగర తీరం వైఎస్సార్సీపీ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. సీఆర్‌జడ్ నిబంధనలకు పాతరేస్తూ వెలిసిన అక్రమ నిర్మాణాలు తీర ప్రాంత పరిరక్షణకు శాపంగా మారాయి. ఇటీవల విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి స్థలంలో కట్టడాలను కూల్చివేశారు. అయితే మరికొన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించిన కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ వాటిపైనా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు లేఖ రాయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. | Read More
ఈ సూచనలు పాటిస్తే చిట్టి గుండె సేఫ్ అంటున్న వైద్యులు - World Heart Day Celebrations in AP
World Heart Day Celebrations in AP : ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో 2కే, 3కే, 5కే రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండె సమస్యలు దరిచేరకుండా ఉండేదుకు వైద్యులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. | Read More
వరద బాధితుల ఖాతల్లో రూ.569 కోట్లు జమ- అకౌంట్లు లేనివారికి ఇలా! - CM Chandrababu Thanks to Officers
CM Chandrababu Thanks to Officers: విజయవాడ వరదల సమయంలో సాయంలో పాల్గొన్న అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. కష్టపడి పనిచేసిన వారికి ధన్యవాదాలు తెలిపేందుకు విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం సమావేశం కానున్నారు. మరోవైపు వరద బాధితుల ఖాతాలలో డబ్బులు జమ చేశారు. ఇప్పటి వరకూ 569 కోట్లు జమ అయిన్నట్లు అధికారులు తెలిపారు. | Read More
ఇవేమి రోడ్లు బాబోయ్ - అడుగుకో గుంత, గజానికో గొయ్యి - Damaged Roads in Srikakulam
People Suffering Due to Damaged Roads in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో అత్యంత కీలకమైన ఆ రహదారి నరకప్రాయంగా మారింది. రోడ్డుపై గోతులు, దుమ్ము, ధూళితో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు మరమ్మతులు కూడా చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు. నూతన ప్రభుత్వమైన ఈ రహదారికి మోక్షం కలిగించాలని వేడుకుంటున్నారు. | Read More
ఉరవకొండలో కొనసాగుతున్న దాహం కేకలు -కూటమి సర్కారుపైనే ఆశలు - Water Problem in Uravakonda
Drinking Water Crisis in Uravakonda : నీటిపారుదల అధికారుల నిర్లక్ష్యంతో వర్షాకాలంలో సైతం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చాలాసార్లు ఆందోళనకు దిగినా అధికారులు స్పందిచలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో వృద్ధులు, మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. | Read More
నిద్రలేచే సరికి 3.5 కిలోల బంగారు ఆభరణాల బ్యాగ్ మాయం - robbery in Train
Massive theft on Hubballi-Vijayawada Express: రైల్వేశాఖ ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా దేశంలో ఏదో ఒక మూలన రైళ్లల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. రైళ్లలో దొంగతనాలు జరగకుండా సిబ్బంది విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. | Read More
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు - చైర్మన్‌గా నారా లోకేశ్ - consultative forum
consultative forum in Andrapradesh : రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నెంబర్ 58ని విడుదల చేసింది. | Read More
భారీ వర్షాలకు పుట్టపర్తి జలమయం - పిడుగుపాటుకు దంపతులు మృతి - Heavy Rains in Sathya Sai District
Heavy Rains in Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దిగువగంగంపల్లితండాలో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. | Read More
"భూ పరిహారం కోసం 42ఏళ్ల పోరాటం" - వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించిన ధర్మాసనం - Old man get land compensation
Man Get Land Compensation After 42 Years: ఓ యువకుడు తనకు ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం కోసం కోర్టుకెక్కాడు. న్యాయ దేవత చుట్టూ 40 ఏళ్లకు పైగా ప్రదక్షిణలు చేశారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వృద్ధాప్యంలో ఉన్న అతడికి పరిహారం ఎంతో అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. | Read More
50 కోట్ల ఆస్తిని కొట్టేసే కుట్ర - 'హత్యను గుండెపోటుగా చూపిన ఐపీఎస్‌లు' - చంద్రబాబుకు బాధితురాలి ఫిర్యాదు - Women Complaint on IPS to CM
CM Chandrababu Naidu Receiving Requests From People : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆస్తి కోసం కొందరు తమ కుమారుడిని హత్య చేస్తే.. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌గున్నీ గుండెపోటు మరణంగా కేసును పక్కదారి పట్టించారని ఓ మహిళ సీఎం చంద్రబాబు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. | Read More
టీటీడీలో ఆ ఇద్దరికే సర్వాధికారాలు- కమిటీలను రబ్బర్ స్టాంపుల్లా "ఏమార్చి"న జగన్ - TTD BOARD
TTD Committees Rubber Stamps During YSRCP Government : టీటీడీ బోర్డును జగన్ సర్కార్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుంది. టీటీడీ కమిటీల్ని కీలుబొమ్మలుగా మార్చేసి పలు అక్రమాలకు పాల్పడింది. కమిటీ సభ్యుల్లో అత్యధికులు ఛైర్మన్, ఈవో చెప్పిన విధంగా నడుచుకునేవారు. నిత్యావసర సరకుల కొనుగోళ్లు, సివిల్ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు తెలిపేవారు. | Read More
శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుత సంచారం - కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్న సిబ్బంది - Leopard Found in Tirupati
Leopard in Tirupati : తిరుపతిలోని శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. టీటీడీ సెక్యూరిటీ గార్డు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. | Read More
"లులు" ఈజ్ బ్యాక్ - ఆ మూడు నగరాల్లో భారీగా పెట్టుబడులపై సీఎంతో చర్చ - Lulu Investments in AP
Lulu Group Came Again to AP : జగన్ సర్కార్ తీరుతో విసిగి ఏపీలో పెట్టుబడులు పెట్టబోమంటూ వెళ్లిపోయిన లులు గ్రూప్ సంస్థ చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మల్టీప్లెక్స్‌ల నిర్మాణంతో పాటు ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంది. | Read More
మహిళలకు గుడ్ న్యూస్ - ఉచితంగా మూడు సిలిండర్లు - ప్రతి కుటుంబానికి లబ్ధి! - AP Free Gas Cylinder Scheme
Three Gas Cylinders Are Free In AP From Diwali Festival?: సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. దీపావళికి దీపం పథకానికి శ్రీకారం చుట్టనుంది. 3 సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. పథకంతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2,476 రూపాయల మేర లబ్ధి చేకూరనుంది. | Read More
శ్రీవారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలు - వీటి పేర్లు, కొలతలు తెలుసా? - Lord Venkateswara Swamy garlands
TIRUMALA VENKATESWARA SWAMY GARLANDS: తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి అలంకార ప్రియుడు. నిత్యం స్వామివారిని వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. అయితే స్వామి వారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలకు పలు పేర్లు ఉన్నాయి. వాటిని తయారు చేయడానికి కొన్ని కొలతలు, నియమాలు పాటిస్తారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. | Read More