ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు - రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర రద్దీ - AP LAND REGISTRATION CHARGES

రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ - మార్కెట్‌ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని ఉత్తర్వులు

AP Land Registration Charges
AP Land Registration Charges (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 7:55 PM IST

AP Land Registration Charges: ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విలువల సరవరణ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని సర్క్యులర్​లో పేర్కొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్​ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపు, తగ్గింపు చేసే అవకాశం ఉంది.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద రద్దీ:ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ దృష్ట్యా కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. గుంటూరులో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద రద్దీ ఉంది. రాత్రి అయినా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో పలుచోట్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్‌ విలువలు సవరిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. మార్కెట్‌ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

15 శాతం నుంచి 20 శాతం వరకు పెంపు:ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. రాష్ట్రానికి రెవెన్యూ అవసరమని, ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్లు మంత్రి సత్యప్రసాద్ చెప్పారు.

విలువలు పెరిగే చోట సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని అన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిని సరి చేసినట్లు తెలిపారు.

ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి అనగాని

అక్కడ వాహనం కొని ఇక్కడ రిజిస్ట్రేషన్​ - ఇకపై ఏపీలో అలా కుదరదు

ABOUT THE AUTHOR

...view details