ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట - సీఆర్‌డీఏ చట్టం

AP High Court on Amaravati Farmers plots GO: రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం కొట్టివేసింది. భూసేకరణ కింద రైతులకు గతంలో సీఆర్‌డీఏ ఈ ప్లాట్లు ఇచ్చింది.

AP High Court on Amaravati Farmers plots GO
AP High Court on Amaravati Farmers plots GO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 4:08 PM IST

Updated : Feb 27, 2024, 4:37 PM IST

AP High Court on Amaravati Farmers Plots G.O :రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వారికి ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. భూసేకరణ కింద రైతులకు గతంలో సీఆర్‌డీఏ (CRDA) ఈ ప్లాట్లు ఇచ్చింది. వీటిని రద్దు చేస్తూ 862 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లాట్ల రద్దు, సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌ (Master Plan)కు విరుద్ధమని నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. అయితే, చట్టంలో మార్పులు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నోటీసులను కొట్టివేసింది. కమిషనర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది.

Last Updated : Feb 27, 2024, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details