ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో వారికి ఇబ్బందే - చట్టంలో తీవ్రమైన లోపం: విశ్రాంత న్యాయమూర్తి - former CJ on land titling act - FORMER CJ ON LAND TITLING ACT

Former Chief Justice on Land Titling Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో మధ్య తరగతి చిన్న కమతాల వారికి ఇబ్బందే అని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి అన్నారు. టీఆర్‌ఓగా ఎవరినైనా నియమించడం చట్టంలో తీవ్రమైన లోపం అని పేర్కొన్నారు. భూవివాదాలు స్థానిక సివిల్‌కోర్టుల్లో పరిష్కరించుకునే వీలు లేదని, హైకోర్టును ఆశ్రయించాల్సిందే అని తెలిపారు.

Former Chief Justice on Land Titling Act
Former Chief Justice on Land Titling Act (etv bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 9:18 AM IST

Former Chief Justice on Land Titling Act: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (Land Titling Act) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి అన్నారు. భూవివాదాలు వచ్చినప్పుడు స్థానిక సివిల్‌ న్యాయస్థానాల్లో పరిష్కరించుకునే వెసులుబాటు లేకపోవడంతో అందరూ హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. సామాన్యులు, నిరక్షరాస్యులకు ఈ చట్టం తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందనిని పేర్కొన్నారు.

ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది: ఈ చట్టం లోపభూయిష్ఠంగా ఉండడం వల్ల భవిష్యత్తులో సమాజంలో విపరిణామాలు చోటుచేసుకుంటాయని విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ‘టీఆర్‌వోగా (Title Registration Officer) ఎవరినైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉండడమే చట్టంలో తీవ్రమైన లోపం అని అన్నారు. నీతి ఆయోగ్‌ సూచించిన విధివిధానాలను పూర్తిగా పొందుపరచకుండా చట్టం తీసుకొచ్చారని, ఈ చట్టం వల్ల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆయన తెలిపారు.

జగన్​ భూ దాహానికి ముసుగు ​చట్టం - ఆ లక్షల ఎకరాలు ఎవరి ఖాతాలోకి? - AP LAND TITLING ACT 2023

చాలామందికి చిన్న చిన్న కమతాలే ఉన్నందున ఈ చట్టంపై అందరికీ అవగాహన లేక పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దూరప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నవారికి మరీ ఇబ్బందులు రావచ్చని, ఆస్ట్రేలియాలో అమలవుతున్న ఈ చట్టాన్ని ఇక్కడ అమలు చేయడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. అక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకుని బీమా ద్వారా రక్షణ కల్పిస్తోందని, ఇక్కడ ప్రభుత్వ పరంగా అలాంటి వెసులుబాటును చట్టంలో పేర్కొనలేదని అన్నారు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా ఎవరినైనా ప్రభుత్వం నియమించుకోవచ్చనే నిబంధన మరీ ప్రమాదకరమైందని వెల్లడించారు.

దీని ద్వారా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వారికి అనుకూలమైన వారిని టీఆరోవోగా నియమించుకోవచ్చని, దీనికి ఎలాంటి అర్హతలు, విధానాలు నిర్దేశించలేదన్నారు. ఈ అధికారులకు నిర్ణీత కాలపరిమితి కూడా లేదని, ఎవరినైనా నియమించుకోవచ్చనే అంశమే చట్టవిరుద్ధమన్నారు. దీనివల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయన్న ఆయన, ఈ చట్టంపై బాధితులకు అవగాహన లేకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీఆర్‌వో వెలువరించిన నిర్ణయంపై కాలపరిమితి లోపల మేల్కొనకపోతే ఆస్తులు కోల్పోవచ్చని, మధ్యతరగతి, చిన్న చిన్న కమతాలు ఉన్నవారు, గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొంటారని విశ్రాంత న్యాయమూర్తి పేర్కొన్నారు.

అంగీకారం, అభ్యంతరం - ల్యాండ్​ టైటిలింగ్​ చట్టంపై మంత్రి వింత సమాధానాలు - Botsa on Land Titling Act

అధికారుల చేతుల్లోకి చట్టం:ఇప్పటికే అమలులో ఉన్న పలు చట్టాలకు ఏపీ భూయాజమాన్య హక్కు చట్టంలో రూపొందించిన నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. వందేళ్ల క్రితం నుంచి దేశంలో అమలులో ఉన్న సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని నిబంధనలు ఈ చట్టం పరిధిలోకి తీసుకురాలేదని వెల్లడించారు. దీంతో టీఆర్‌వో విధి విధానాలపై స్పష్టత లేదని, ఇప్పటివరకు స్వల్ప స్థాయి భూవివాదాలను స్థానిక కోర్టుల్లోనే పరిష్కరించుకుని బాధితులు ఉపశమనం పొందుతున్నారని పేర్కొన్నారు.

ఈ చట్టం ద్వారా బాధితులు హైకోర్టును మాత్రమే ఆశ్రయించాలని, దీనివల్ల హైకోర్టులో మరింత పనిభారం పెరిగి వివాదాల పరిష్కారానికి జాప్యం జరగడంతో పాటు బాధితులపై మోయలేని ఆర్థికభారం పడుతుందని తెలిపారు. హైకోర్టు దాకా వెళ్లలేని సామాన్యులు నిస్సహాయస్థితిలో వారి ఆస్తులపై హక్కులను వదులుకోక తప్పదన్నారు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా నియమితులయ్యే వ్యక్తికి ఎలాంటి అర్హతా నిర్ధారించకపోవడంతో వారికి భూహక్కులు, చట్టాలపై కనీస అవగాహన ఉండే అవకాశం లేదన్నారు. దీంతో బాధితులకు న్యాయపరమైన రక్షణ, భరోసా కల్పించే అవకాశం తక్కువని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి వివరించారు.

గుబులు పుట్టిస్తోన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ - ఆస్తుల సంగతేంటి? - AP Land Titling Act 2023

ABOUT THE AUTHOR

...view details