ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధునాతన సాంకేతికత లక్ష్యం - ఐఐటీ మద్రాసుతో 8 ఒప్పందాలు - IIT MADRAS AP GOVT MOUS

అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందాలు

Madras_IIT_AP_Govt_MOUs
IIT Madras AP Govt MOUs (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 8:23 PM IST

AP Govt MOUs With IIT Madras: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీ సీఆర్​డీఏ ఒప్పందం చేసుకుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీ మద్రాసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదిరింది.

IIT Madras AP Govt MOUs (ETV Bharat)

స్వయం ప్లస్, ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫారంల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరు పార్టీల నడుమ ఒప్పందం కుదిరింది. విమానాశ్రయాలను లాజిస్టిక్స్/ మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఇన్వెస్టిమెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.

IIT Madras AP Govt MOUs (ETV Bharat)

అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేసేలా ఐటీ శాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్​వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఆర్‌టీజీఎస్‌తో ఒప్పందం కుదిరింది. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు క్రీడల శాఖ ఒప్పందం చేసుకుంది.

IIT Madras AP Govt MOUs (ETV Bharat)

రాష్ట్రంలో రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

వాట్సప్​లోనే అన్ని సర్టిఫికెట్లు - "మెటా"తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details