Govt Extends Time for TET and DSC Exams:టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేర ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయం- త్వరలో కొత్త తేదీలు ప్రకటన - TET and DSC Exams - TET AND DSC EXAMS
Govt Extends Time for TET and DSC Exams: రాష్ట్రంలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయిస్తూ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేసింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 5:27 PM IST
టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల వినతుల మేరకు మంత్రి లోకేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. టెట్ పరీక్ష నిర్వహణకు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణకు 90 రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది.