ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెక్నాలజీపై ఫోకస్ - రాష్ట్ర ప్రభుత్వంతో మరో రెండు సంస్థలు ఎంఓయూ - EDUCATION MINISTER NARA LOKESH

సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఒప్పందాలు జరిగాయన్న మంత్రి నారా లోకేశ్

MoU with Physics Wala and Tony Blair Institute
MoU with Physics Wala and Tony Blair Institute (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 7:12 PM IST

Physics Wala and Tony Blair Institute sign MoU :అధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఆవిర్భవిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో డీప్-టెక్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో AI-ఫోకస్డ్ ఫస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE), యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ (UoI)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) చేసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (TBI)తో మరో ఒప్పందం చేసుకుంది.

ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఫిజిక్స్ వాలా, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వేర్వేరుగా ఎంఓయూ చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం.. అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్‌ను అనుసరించి ఇన్నొవేషన్ యూనివర్సిటీ సెంట్రల్ హబ్‌గా పని చేస్తుంది.

'ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' లక్ష్యం - ఉపాధ్యాయులపై భారం తగ్గిస్తాం : లోకేశ్

దీనిద్వారా విభిన్న నేపథ్యాలు, వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన, హైబ్రిడ్ విద్యను యాక్సెస్ చేస్తారు. ఆన్‌లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను ఇంటిగ్రేట్ చేస్తారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పరిశ్రమ భాగస్వామితో ఫిజిక్స్ వాలా కలిసి పని చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ వాలా ఫౌండర్, సీఈఓ అలఖ్ పాండే, కో ఫౌండర్ ప్రతీక్ బూబ్, పీడబ్ల్యూ ఫౌండేషన్ హెడ్ విజయ్ శుక్లా, డైరెక్టర్ సోన్ వీర్ సింగ్, హెడ్ ఆఫ్ ఇన్నొవేషన్స్ దినకర్ చౌదరి పాల్గొన్నారు.

కృత్రిమ మేధ (AI)లో ఏపీ యువతను నంబర్ వన్​గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, అందుకు రాష్ట్ర యువతను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పరిశ్రమల డిమాండ్, ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్​మెంట్​పై యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ దృష్టి సారిస్తుందన్నారు.

అధునాతన సాంకేతికత, విద్యను ఏకీకృతం చేయడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కృషి చేస్తుందని వెల్లడించారు. టాలెంట్ డెవలప్​మెంట్, నాలెడ్జి క్రియేషన్​లో ఏపీని బలోపేతం చేయాలని ఫిజిక్స్ వాలాను కోరారు. ఏపీని ఏఐ హబ్​గా తీర్చిదిద్దేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఇందుకోసం ఏఐలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక, నెక్స్ట్ జనరేషన్ నైపుణ్యాలకు మార్గం సుగమం చేస్తున్నామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

సర్కారీ స్కూళ్లకు స్టార్ రేటింగ్‌ - కేజీ నుంచి పీజీ వరకూ సంస్కరణలు : లోకేశ్

'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' - ఆరు నెలల పాలనపై చంద్రబాబు, లోకేశ్ ఏమన్నారంటే!

ABOUT THE AUTHOR

...view details