Andhra Pradesh Govt New Scheme: మీ పిల్లలు చదువుకుని ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారా? స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారా? ఇలాంటివారి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇరుగుపొరుగు వ్యాపారం (Neighborhood Business) అనే సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న మహిళలు, యువతులతో ప్రత్యేకంగా డ్వాక్రా (DWCRA) తరహాలో సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తదుపరి దశలో దీనిని పురుషులు, యువకులకు సైతం విస్తరిస్తారు.
ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్‌లో 1.10 కోట్లకుపైగా ఉన్న డ్వాక్రా మహిళలపై సెర్ప్ ద్వారా సర్వే చేశారు. డ్వాక్రా మహిళలు, వారి పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం చదువుతున్నవారు ఉన్నారా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, స్వయం ఉపాధి వైపు వచ్చేందుకు ఆసక్తి ఉందా, ఏ రకం జీవనోపాధిపై వారిని ఆసక్తి ఉంది అనే వివరాలను సేకరించారు. అదే విధంగా ఇప్పటికే వ్యవసాయం, స్వయం ఉపాధి చేస్తూ మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆసక్తి ఉన్న వారు ఎవరు అనే వివరాలను 4 రోజులుగా సేకరించారు. ఈ సర్వేలో దాదాపుగా 20 లక్షల మంది మహిళలు, యువతులు స్వయం ఉపాధిపై తమ ఆసక్తిని కనబరిచినట్లు తెలుస్తోంది.
పైలట్ ప్రాజెక్టు కింద 100 నైబర్‌హుడ్ బిజినెస్ యూనిట్ల(NBU) ఏర్పాటుకు సెర్ప్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. నైబర్‌హుడ్ బిజినెస్ యూనిట్ల ఏర్పాటుకు ఎంపికచేసే సంఘంలో 5 నుంచి 1000 మంది సభ్యులు ఉండొచ్చు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నవారికి అనువైన స్వయం ఉపాధిని ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది.
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు- ఏకంగా రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం- అర్హతలు ఇవే! - Government Free Money Distribution
పనిచేసేందుకు వర్క్‌స్టేషన్లు:మహిళలు, యువతులకు ఉపాధిని కల్పించేందుకు ఎంఎస్‌ఎంఈ (Ministry of Micro, Small & Medium Enterprises) శాఖను అనుసంధానం చేయనున్నారు. ఇంటినుంచి దూరం వెళ్లకుండా, వారి ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి కల్పించాలనేదే ఎన్‌బీయూ ముఖ్య ఉద్దేశం. గ్రూప్‌లోని సభ్యులంతా కలిసి పనిచేసేందుకు వీలుగా వర్క్‌స్పేస్/వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ గ్రూపులను సహకార సంఘాల కింద రిజిస్టర్ చేయనున్నారు.
యువత చదువుకు అనుగుణంగా 12 రకాల విభాగాల్లో స్వయం ఉపాధి మార్గాలను ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఐటీ, లీగల్, ఎకౌంటింగ్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్, కన్సల్టింగ్ సర్వీసెస్‌తో పాటు టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, రిటైల్ స్టోర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ అండ్ బెవరేజ్, ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్‌కేర్, హోమ్ అండ్ గార్డెన్, అటోమోటివ్ సర్వీసెస్, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ రిక్రియేషన్, స్పెషాలిటీ షాప్స్, కల్చరల్ అంట్ కమ్యూనిటీ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ విభాగాల్లో 49 జీవనోపాధి మార్గాలను ప్రభుత్వం గుర్తించింది. వీటి ఏర్పాటుకు బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థల నుంచి తోడ్పాటు ఉంటుంది. వీటితో పాటు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌కు వీలుగా ట్రైనింగ్ ఇస్తారు. గ్రూప్‌ల పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఎన్‌బీయూ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బ్యాంకింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషియాలజీ తదితర రంగాల ఎక్స్‌పర్ట్స్‌ను నియమిస్తారు.
నెలకు రూ.5వేలు పెట్టుబడితో రూ.42లక్షల ఆదాయం - PPF స్పెషల్ స్కీమ్! - PPF Special Scheme