Additional Coaches to Secunderabad-Visakha Vandebharath Express: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా కోచ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేసింది. అదనపు కోచ్‌లు జనవరి 11 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మరో 4 కోచ్‌లు పెంచడం ద్వారా ప్రస్తుతం 1,128గా ఉన్న సీటింగ్ కెపాసిటీ 1,414కి చేరనుంది.
Sankranti Special Trains : సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. కొన్ని ప్రధాన స్టేషన్ల మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అదనంగా నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు నేటి నుంచి (జనవరి 10) 17వ తేదీల మధ్యలో సర్వీసులు నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి చర్లపల్లి మధ్య పలు జన సాధారణ్ రైళ్లను నడపనున్నారు.
ఈ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు చర్లపల్లి నుంచి విశాఖపట్నం స్టేషన్ల మధ్య నేటి నుంచి 17వ తేదీల్లో మొత్తం 16 జన సాధారణ్ రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్- అర్సికెరే (కర్ణాటక), బెంగళూరు - కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ అదనపు ప్రత్యేక రైళ్లు సర్వీసులందించే తేదీలు, రూట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇప్పటికే రైల్వేస్టేషన్లు అన్నీ రద్దీగా మారాయి. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయటంతో ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తోంది. అయితే రద్దీ దృష్టిలో పెట్టుకుని మరిన్ని రైళ్లు ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రాష్ట్రానికి వందే భారత్ స్లీపర్ - ఆ రెండు మార్గాల్లో కొత్త రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే బంపర్ ఆఫర్ - సంక్రాంతికి మరో 52 ప్రత్యేక రైళ్లు! - బుకింగ్ ఓపెన్