ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు అండ్రాయిడ్ మిత్రుడు - ఈ యాప్​తో మీ సమస్యలకు చెక్ - FARMER CHAT APP IN AP

ఒక్క క్లిక్‌తో తెగుళ్ల వెతలకు చెక్‌ - రైతులకు ఉపయుక్తంగా యాప్‌ సేవలు

Farmer Chat App in AP
Farmer Chat App in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 1:41 PM IST

Farmer.Chat App in AP :అన్నదాతలకు జీవనాధారమైన పంటల సాగులో నానాటికీ సాంకేతికత పెరుగుతోంది. అందిపుచ్చుకుంటే మేలైన దిగుబడులూ సాధించే వీలుంది. ఈ క్రమంలో కర్షకులకు మిత్రుడిలా సలహాలు, సూచనలు అందించే Farmer.chat యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్‌ చరవాణులు ఉపయోగించే వారు ఈ యాప్‌ సాయంతో సాగులోని సమస్యలు తెలిపి సులువుగా పరిష్కార మార్గాలు పొందే అవకాశాన్ని కల్పించింది. దీంతోపాటు ఉద్యాన, వ్యవసాయ పంటల సమగ్ర సమాచారం, పైర్లకు వచ్చే తెగుళ్లు, నివారణ చర్యలు, వాతావరణ సలహాలు, సూచనలు, మార్కెట్‌ వివరాలు తెలుసుకునే వీలుంది.

ఇవీ అన్నదాతకు అందే సేవలు :పంటను ఆశించిన తెగులుతో మొక్క ఫొటో తీసి Farmer.chat యాప్‌లో అప్‌లోడ్‌ చేయగానే పైరుకు ఎలాంటి తెగులు సోకింది, దాని నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుపుతూ సందేశాలు వస్తాయి. పంట ఆరోగ్యంగా తయారవడానికి ఏ మందులు వాడాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలో తెలుపుతుంది. వీటితోపాటు ఎప్పుడు, ఎన్నిసార్లు చేయాలో కూడా వివరిస్తుంది. వాటిల్లో సేంద్రియ, రసాయన మందుల వివరాలను ఎలా వాడాలో విడివిడిగా అందిస్తుంది.

  • పంటకు సుమారు వంద కిలో మీటర్ల పరిధిలో ఉన్న మార్కెట్‌ వివరాలనూ వెల్లడిస్తుంది. ఏఏ పంటలకు ఎంత మేర ధరలున్నదీ యాప్‌ సాయంతో తెలుసుకునే అవకాశం కూడా ఉంది.
  • సాగు చేసే పొలంలోని మట్టి సాంద్రతను పెంపొందించే విధానాలను రైతన్నకు వివరిస్తుంది.
  • వాతవరణ పరిస్థితులు, గాలిలో తేమ శాతం, గాలి దిశ, అక్కడ ఉన్న ఉష్ణాగ్రతలను తెరపై చూపుతుంది. యాప్‌పై కంభం ఉద్యాన శాఖ అధికారిణి శ్వేత మాట్లాడుతూ ఫార్మర్‌. చాట్‌ యాప్‌ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్ని రకాల పంటల వివరాలు అందుబాటులో ఉంటాయని, కర్షకులకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details