తెలంగాణ

telangana

శ్రీవారి భక్తులకు శుభవార్త - తిరుమల లడ్డూకు మళ్లీ నందిని నెయ్యి - కిలో ఎంతో తెలుసా? - Nandini Ghee to Tirupati Laddu

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Tirupati Laddu Controversy : పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లడ్డూ తయారీలో నందిని నెయ్యినే వినియోగించాలని నిర్ణయించారు. గత 20 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని సంస్థ 2022-23లో ధరల సమస్యతో తిరుపతికి నెయ్యి సరఫరా నిలిపివేసింది. తాజాగా టీటీడీ నందిని సంస్థకు నెయ్యి సరఫరా చేయాలని సప్లై ఆర్డర్‌ ఇచ్చింది. ఫలితంగా తిరుమల లడ్డూలో నందిని నెయ్యి సువాసన రానుంది.

Tirupati Laddu Controversy
Tirupati Laddu Controversy (ETV Bharat)

Nandini Ghee to Tirumala Laddu in AP : తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణ పెద్ద సంచలనం సృష్టించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వివాదానికి ముందు తిరుపతి లడ్డూకు 20 ఏళ్లుగా స్వచ్ఛమైన నందిని నెయ్యి వాడేవారు. కానీ 2023లో ధరల సమస్యను కారణంగా చూపుతూ నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. తాజా వివాదంతో తిరుమలకు స్వచ్ఛమైన నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

తిరుపతి లడ్డూకి నందిని నెయ్యి:తిరుపతి లడ్డూ తయారీలో కర్ణాటకకు చెందిన స్వచ్ఛమైన నందిని నెయ్యి గత 20 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. అయితే 2022-23లో ధర ఎక్కువగా ఉందనే కారణంతో తిరుపతికి నందిని నెయ్యి సరఫరా నిలిచిపోయింది. టీటీడీకి 2013-14 నుంచి 2021-22 వరకు 5 వేల టన్నుల నెయ్యిని కేఎంఎఫ్ (Karnataka Milk Federation) సరఫరా చేసింది. 2022-23లో కేఎంఎఫ్ నెయ్యిని సరఫరా చేయలేదు. అధిక ధర ఉందనే కారణంగా చూపుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నందిని నెయ్యి టెండర్​ని తిరస్కరించింది.

కిలో నందిని నెయ్యి రూ.478: తాజా వివాదం నేపథ్యంలో 2024-25 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేయాలని ఆర్డర్‌ ఇచ్చారు. కిలో నందిని నెయ్యిని 478 రూపాయల చొప్పున టీటీడీ KMF నుంచి నందిని నెయ్యిని కొనుగోలు చేస్తుంది. దీంతో ఇప్పుడు మళ్లీ తిరుమల లడ్డూకి నందిని నెయ్యి సువాసనలు కలవనున్నాయి.

"తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు నెయ్యి సరఫరా ఆర్డర్‌ వచ్చింది. తిరుమల అధికారులు కొద్ది రోజుల క్రితమే 350 మెట్రిక్ టన్నుల నెయ్యి కోసం ఆర్డర్ చేశారు. బెంగళూరులోని KMF నుంచి మేం అంత నెయ్యిని సరఫరా చేస్తాం. ఆవు నెయ్యిని మాత్రమే తిరుమలకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చాం. స్వామివారి ప్రసాదంలో ఆవు నెయ్యి మాత్రమే వినియోగిస్తారు". -ఈటీవీ భారత్​తో భీమా నాయక్‌, KMF ప్రెసిడెంట్

నందిని నెయ్యి సరఫరా వివరాలు: 2013-14 నుంచి 2021-22 వరకు, కేఎంఎఫ్ టీటీడీకి 5 వేల టన్నుల నెయ్యిని సరఫరా చేసింది. కేఎంఎఫ్ అందించిన సమాచారం ప్రకారం

  • 2014-15లో టీటీడీకి 200 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యి సరఫరా అయింది. అప్పట్లో నెయ్యి కిలో ధర రూ.306గా నిర్ణయించారు.
  • 2015-16లో కిలో రూ.306 చొప్పున 709 మెట్రిక్ టన్నుల నెయ్యి సరఫరా చేశారు.
  • 2016-18లో తిరుపతికి నందిని నెయ్యి సరఫరా నిలిచిపోయింది.
  • 2018-19లో 85 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యి సరఫరా చేశారు. ఈ సమయంలో నెయ్యి కిలో ధర రూ.324గా నిర్ణయించారు.
  • 2019-20లో 1408 మెట్రిక్ టన్నుల నెయ్యిని కిలో రూ.368కి సరఫరా చేశారు.
  • 2020-21లో నెయ్యి సరఫరా నిలిచిపోయింది.
  • 2021-22లో 345 మెట్రిక్ టన్నుల నెయ్యిని కిలో రూ.392కి సరఫరా చేశారు.

అప్పటి నుంచి నెయ్యి కొనుగోలు నిలిచిపోయింది:2022-23 టీటీడీ టెండర్‌లో కేఎంఎఫ్ కిలో నెయ్యి ధర రూ.450గా నిర్ణయించి టెండర్​ వేశారు. టెండర్‌లో, ఇతర కంపెనీలు KMF కంటే తక్కువ బిడ్ చేశాయి. దీంతో నందిని నెయ్యి బదులు టీటీడీ తక్కువ ధర వేసిన మరో కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసింది. దీంతో 2023 నుంచి కేఎంఎఫ్ నుంచి నందిని నెయ్యి కొనుగోలును టీటీడీ నిలిపివేసింది.

ఇప్పుడు 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యి కోసం ఆర్డర్: 2024-25 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ ద్వారా 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఇప్పుడు మళ్లీ తిరుమల లడ్డూకు నందిని నెయ్యి సరఫరా కానుంది.

ఘోర అపచారం : తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమే - వైసీపీ అరాచకాలపై విస్తుపోతున్న శ్రీవారి భక్తులు - Tirupati Laddu Updates

తిరుమల శ్రీవారి లడ్డూకే ఎందుకంత రుచి? - ఇలా తయారు చేస్తారు కాబట్టే ఆ స్పెషల్ టేస్ట్ - How to Make Tirumala Laddu Prasadam

ABOUT THE AUTHOR

...view details