పోలవరం ఎప్పటికి పూర్తిచేద్దామనుకుంటున్నారు?- ప్రాజెక్టు నిర్మాణ బాధ్యులపై సీఎం అసహనం (ETV Bharat) AP CM Chandrababu Polavaram Tour :సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అక్కడికక్కడే వారిని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. అనంతరం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు.
ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదు : పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో చంద్రబాబు అధికారులను నిలదీశారు. 2019, 2020 వరదల సమయంలో అధికారులు ఎవరున్నారు? డయాఫ్రంవాల్ ధ్వంసం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికంగా చీఫ్ ఇంజినీర్ ఉన్నారని ఈఎన్‌సీ నారాయణరెడ్డి సమాధానం ఇచ్చారు. 'ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా మీరూ బాధ్యత వహించాలి కదా మీరు చూసుకోవాలి కదా' అని సీఎం నిలదీశారు. అందుకు ఆయన సమధానం చెప్పలేకపోయారు. ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదని క్షమించరాని నేరమని, దిద్దుకోలేని నష్టం జరిగిందని అని సీఎం అన్నారు.
పోలవరం పూర్తికి నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు- సీఎం చంద్రబాబు - AP CM Chandrababu on Polavaram
అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపం :పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందని సమీక్షలో పాల్గొన్న మేఘా ఇంజినీరింగ్ ప్రతినిధి సుబ్బయ్యను సీఎం ప్రశ్నించారు. నాలుగు సీజన్లు అవసరమని ఆయన సమాధానం ఇవ్వగా ఇప్పటికే ఒక సీజన్ కోల్పోయినట్లే కదా అని ప్రశ్నించారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతికి చెందిన సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ప్రశ్నార్థకంగా మారిన పోలవరం కీలక కట్టడాలు - చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్! - Polavaram Construction
అంచనా వ్యయం తగ్గిందన్న అధికారులు : పోలవరం ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువల అంచనా వ్యయం తగ్గిందని అధికారులు పేర్కొనగా కాలువల ప్రవాహ సామర్థ్యం, పొడవు, వెడల్పు మారకుండా అంచనా వ్యయం ఎలా తగ్గుతుందని సీఎం ప్రశ్నించారు. దీనికి అధికారులు నీళ్లు నమిలారు. గతంలో ఈఎన్‌సీగా పనిచేసిన ఎం. వెంకటేశ్వరరావు ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి అనేక అంశాలు వివరించారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని ఒక కేస్ స్టడీగా భావించాలని, దీని కారణంగా ఏపీకి ఎంత నష్టం జరిగిందో అంచనా వేయలేమని చంద్రబాబు అన్నారు. దీనిపై ఎంత నష్టం జరిగిందన్న విషయంపై చర్చ జరగాలని కోరుతున్నట్లు చెప్పారు.
ఏపీ జీవనాడైన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం విధ్వసం చేసింది: మంత్రి నిమ్మల - Irrigation Minister Rama Naidu