తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు కళ్లూ పొడిచేశారు! - విలువల విధ్వంసానికి ప్రతీకగా ప్రజావేదిక - SYMBOL OF DESTRUCTION IN AP - SYMBOL OF DESTRUCTION IN AP

Symbol Of Destruction in AP : జగన్​ విధ్వంసానికి చిరునామాగా ప్రజావేదికను గుర్తుగా ఉంచుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సోమవారం పోలవరాన్ని సదర్శించిన చంద్రబాబు అమరావతిలో అడుగడునా పర్యటించారు. ఐదేళ్ల కిందట వేసిన పునాది ఇన్నాళ్లుగా జరిగిన విధ్వంసాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు కళ్లు చెమ్మగిల్లాయి.

Symbol Of Destruction
Symbol Of Destruction (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 6:54 PM IST

Symbol Of Destruction in AP : ఏపీపై పగబట్టారా? అన్నట్లుగా ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన జగన్ పాలన అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రతి నిర్ణయం ఏపీ భవిష్యత్​కు పెనుశాపంలా పరిణమించింది. రాష్ట్రానికి రెండు కళ్లలాంటి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకం కాగా, ఏపీలో అపారంగా లభించే ఇసుక అధికార పార్టీ పెద్దలకు 'బంగారు బాతు'లా మారింది.

జగన్​ విధ్వంసానికి గుర్తుగా :గ్రావెల్​ మాఫియా దెబ్బకు ఎన్నో కొండలు కరిగిపోయాయి. ఐదేళ్ల అరాచకాలకు చరమగీతం పాడుతూ కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రపంచ యుద్ధాల్లో అణుబాంబు దాడికి గురై ఇప్పటికీ కోలుకోలేకపోయిన హిరోషిమా, నాగసాకిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా వేదికను జగన్​ విధ్వంసానికి గుర్తుగా అలాగే ఉంచుతామని ప్రకటించారు.

2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అప్పటికి రాజధాని లేదు. ఆదాయ వనరులూ అంతంత మాత్రమే. "చుట్టూ కంప చెట్లు, నేలంతా రాతి బండలు, జాడలేని నీటి ఆనవాళ్లు!" అలాంటి పరిస్థితుల్లో సేద్యం (పాలన) బాధ్యతను భుజానికెత్తుకున్నారు చంద్రబాబు. ముందుగా రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేశారు.

రైతుల సహకారంతో దాదాపు 55వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారు. ప్రగతి పట్టాలెక్కుతున్న తరుణంలో వచ్చిన ఎన్నికలు ఏపీ భవిష్యత్​ను మలుపు తిప్పాయి. వరల్డ్ టాప్​ టెన్​ సిటీ జాబితాలోకి ఎక్కుతుందనుకున్న అమరావతి నగరం నిర్మాణానికి ఆశనిపాతంలా మారాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2017 నవంబర్‌లో ప్రజా వేదికను అందుబాటులోకి తెచ్చారు. సుమారు 500మంది పట్టేలా, కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఇతర సమీక్షలు బహుళ ప్రయోజనాలకు వీలుగా నిర్మించిన ప్రజావేదిక భవనం నిర్మించారు. తన నివాసానికి పక్కనే సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం పీఠం దిగిపోయిన చంద్రబాబు ప్రజావేదికను ప్రతిపక్ష నేతగా తనకు కేటాయించాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. తన అధికారిక కార్యకలాపాలకు, ఎమ్మెల్యేలు, సందర్శకులు తనను కలిసేందుకు వీలుగా భవనాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసి రెండు వారాలు దాటినా ప్రభుత్వం స్పందించలేదు.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. పైగా విధ్వంసాలకు బీజం పడింది. వచ్చీ రావడంతోనే ప్రజా వేదికను ధ్వంసం చేశారు. ప్రజా ధనంతో నిర్మించిన భవనాన్ని నేలకూల్చి వికటాట్టహాసం చేశారు. బటన్​ నొక్కుడు మాటున బొక్కుడు మొదలైంది. మద్యం, ఇసుక, మట్టి మాఫియాకు తెరలేచింది.

అవినీతి, అక్రమాలు, అరాచకాలకు వైసీపీ వంతపాడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలు దారుణంగా కుప్పకూలిపోయాయి. రుషులు తపస్సు చేసిన రుషికొండను నాశనం చేశారు. ఖజానా లూఠీకి పాల్పడ్డారు. లెక్కలు చూపించి.. చూపించకుండా ఎన్నో చోట్ల అప్పులు తెచ్చారు. దక్షిణ భారత ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్​గా మార్చేశారు.

Jagan Govt Demolished Praja Vedika :ప్రజావేదిక కూల్చివేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే అధికారులు చర్యలు చేపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో రెండో రోజు సమీక్ష ముగిసిన వెంటనే కూల్చివేత పనులు మొదలయ్యాయి. సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజినీర్ల సమక్షంలో వందమంది కూలీలు, జేసీబీలు, ఇతర వాహనాలతో కూల్చివేత పనులు శరవేగంగా జరిగాయి.

జోరువానలోనూ ప్రజావేదిక కూల్చివేత పనులు కొనసాగించడం గమనార్హం. అప్పటికి విదేశాల్లో ఉన్న చంద్రబాబు ప్రజావేదిక వివాదంపై పార్టీ నేతలతో టెలీ కాన్ఫెరెన్స్‌లో చర్చించారు. కనీసం సమాచారం లేకుండా ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం, వ్యక్తిగత సామగ్రి తరలించకుండా కక్షపూరితంగా వ్యవహరించడాన్ని నాయకులు ఖండించారు.

చెమ్మగిల్లిన చంద్రబాబు కళ్లు - మట్టిని ముద్దాడి అమరావతికి సాష్టాంగ నమస్కారం - AP CM Chandrababu Amaravati Tour

సీఎం పీఠంపై మరో 30ఏళ్లు - రుషికొండపై కలల​ ​రాజప్రాసాదం కథ అదే! - Rushikonda Palace

ABOUT THE AUTHOR

...view details