Election Result in West Godavari : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 14 స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ గెలుపొందారు. భీమవరంలో జనసేన అభ్యర్థి పులివర్తి ఆంజనేయులు విజయం సాధించారు. చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ గెలుపొందారు. దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మెజార్టీలో కొనసాగుతున్నారు.
ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి తానేటి వనితపై టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధిక్యంలో ఉన్నారు. కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ముందంజలో ఉన్నారు. నర్సాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఆధిక్యంలో ఉన్నారు. నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ముందంజలో ఉన్నారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు 69 వేల మెజార్టీతో గెలుపొందారు.
తాడేపల్లిగూడెంలో 66,039 ఓట్లతో జనసేన అభ్యర్థి బొడిశెట్టి శ్రీనివాస్ విజయం సాధించారు. తణుకులో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ విజయం సాధించారు. ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు 56,421 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు 44,107 ఓట్ల మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. పోలవరంలో వైఎస్సార్సీపీ ఆభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు.
ఆచంట :
ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం సాధించారు.
భీమవరం :
భీమవరంలో జనసేన అభ్యర్థి పులివర్తి ఆంజనేయులు గెలుపొందారు.
చింతలపూడి :
చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ విజయం సాధించారు.
దెందులూరు :
దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మెజార్టీలో కొనసాగుతున్నారు.
ఏలూరు :
ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు.
గోపాలపురం :
గోపాలపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి తానేటి వనితపై టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధిక్యంలో ఉన్నారు.