తెలంగాణ

telangana

ETV Bharat / state

పెయింటింగ్‌లో రాణిస్తున్న ప్రభుత్వ టీచర్‌ - 35 ప్రపంచ స్థాయి అవార్డులు కైవసం

Anuradha Painting Teacher In Sangareddy : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. వాటిపై దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలను అందుకోవడం ఖాయమని నిరూపించింది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తన వృత్తికి న్యాయం చేస్తూనే ఇష్టమైన పెయింటింగ్‌ రంగంలో రాణిస్తోంది. వందల సంఖ్యలో అవార్డులు సొంతం చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

School Teacher From Sangareddy Draws Paintings
Anuradha Painting Teacher In Sangareddy

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 11:09 AM IST

పెయింటింగ్‌లో రాణిస్తున్న ప్రభుత్వ టీచర్‌ - 35 అవార్డులు కైవసం చేసుకున్న ఉపాధ్యాయురాలు

Anuradha Painting Teacher In Sangareddy : హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనురాధ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నివసిస్తూ మునిపల్లి మండలం పెద్దగోపులారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. 2005లో ఆ వృత్తిలో చేరిన ఆమె, చిన్నప్పటి నుంచే పెయింటింగ్, అల్లికలపై ఆసక్తి పెంచుకున్నారు. రావి ఆకులపై స్వాతంత్య్ర సమర యోధుల చిత్రాలను అవలీలగా వేస్తోంది. కొవిడ్‌ సమయంలో దాదాపు 90 రోజులు కష్టపడి 44.4 ఇంచుల చీరను పెయింటింగ్‌ వేసి ఏకంగా 35 ప్రపంచ స్థాయి అవార్డులు కైవసం చేసుకుంది. గృహిణిగా ఇంట్లో పనులు చేస్తూ, ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ, ఇష్టమైన పెయింటింగ్‌లు వందల సంఖ్యలో వేసి అవార్డులు సొంతం చేసుకుంది.

అటుకులపై 30 దేశాల జాతీయ జెండాలు పెయింటింగ్- 30 సెకన్లలో వేసి విద్యార్థిని రికార్డ్

"చిన్నప్పటి నుంచి మా అమ్మ అల్లికలు, కుట్లు చూస్తూ ఈ కళను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడున్న ఈ తరం వారికి నచ్చే విధంగా మార్పు చేస్తూ పెయింటింగ్‌ వేయడం మొదలుపెట్టాను. పెయింటింగ్‌ అందరూ వేస్తారు. నాకంటూ ఓ ప్రత్యేకత, గుర్తింపు ఉండాలని కరోనా సమయంలో బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ చాలా ఆన్‌లైన్‌ పెయింటింగ్‌లో పాల్గొన్నాను. దాదాపు 90 రోజులు కష్టపడి చీరపై పెయింటింగ్‌ వేసి 35 ప్రపంచ స్థాయి అవార్డులు గెలుపొందాను. డ్రాయింగ్‌ ఒక్కటే కాకుండా క్రాప్ట్‌, ఆర్ట్‌ వర్క్‌, గ్లాస్‌ పెయింటింగ్‌, గోడ పెయింటింగ్‌ చాలా ప్రయత్నం చేశాను. ఆకులపై పెయింటింగ్‌ బాగా గుర్తింపు తెచ్చింది." - అనూరాధ, ఉపాధ్యాయురాలు

Portraits with Millets : చిరుధాన్యాలతో జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు

School Teacher From Sangareddy Draws Paintings : పెయింటింగ్‌ను నేర్చుకుంటూనే ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికైంది. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పెయింటింగ్‌ కళను నేర్పిస్తూ అండగా నిలుస్తోంది. పోటీల్లో పాల్గొనే స్థాయి నుంచి ప్రస్తుతం పెయింటింగ్ పోటీలు నిర్వహించే న్యాయమూర్తిగా వ్యవహరించే స్థాయికి వచ్చినందుకు ఆనందంగా ఉందని అనురాధ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన భార్య పెయింటింగ్‌లో అన్ని అవార్డులు అందుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తోందని ఆమె భర్త అంబదాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని ఖాళీ సమయాల్లో వాటిపై దృష్టి పెడితే ఉన్నత శిఖరాలను అందుకోవడం ఖాయమని అనురాధ సూచిస్తున్నారు.

"ప్రభుత్వ పరంగా టీచర్‌గా పనిచేయడం, దానితో పాటు పెయింటింగ్‌లో రాణించడం చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్‌లో ప్రపంచస్థాయి అవార్డులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా భార్య శ్రమకు తగ్గ ఫలితం దక్కిందని అనిపిస్తుంది. భవిష్యత్తులో పెయింటింగ్‌ పోటీలలో విజయం సాధించాలని కోరుకుంటున్నా."- అంబదాస్, అనూరాధ భర్త

సూక్ష్మకళలో రాణిస్తోన్న యువ కళాకారుడు.. ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తాడటా..!

Actress Shamlee Paintings : కుంచె పట్టిన 'ఓయ్'​ హీరోయిన్​.. తన నెక్స్ట్​ టార్గెట్​ ఏంటంటే..

ABOUT THE AUTHOR

...view details