Annamayya Woman Facing Difficulties in Dubai : పొట్టకూటి కోసం, ఉపాధి దొరికితే కుటుంబానికి అండగా ఉండొచ్చనే ఆశ వారిది. అందుకు పుట్టిన ప్రాంతాన్ని, అయిన వారిని దూరంగా ఉండటానికైనా మనసు చంపుకొని సిద్ధం అవుతారు వారంతా. స్వదేశంలో ఉపాధి కరవై అప్పులు చేసి ఎడారి దేశాల బాట పటడుతున్నారు. ఉద్యోగం పేరుతో వెళ్లిన మనవారి పాస్‌పోర్టులను అక్కడి పని ఇచ్చిన యజమానులు లాగేసుకుంటున్నారు. ఆ తర్వాత వారు తమ అసలు రూపాన్ని బయటపెడుతున్నారు.
Annamayya Woman Tortured in Saudi :మనవారి అక్కడి కడుపు నిండా తిండి పెట్టకుండా, కంటినిండా నిద్రపోనివ్వకుండా చిత్ర హింసలు గురి చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అక్కడ బాధితులకు నా అనే వారు లేకపోవడంతో యజమానులు వారికి నరకం చూపిస్తున్నారు. ఆ బాధలు భరించలేక సొంతురుకు వెళ్తామంటే గదిలో బంధించి చిత్రహింసలు గురి చేస్తున్నారు. దీంతో మనవారు కన్న బిడ్డలను, పుట్టిన ఊరును గుర్తుతెచ్చుకొని కుమిలిపోతున్నారు. ఆ బాధలను భరించలేక స్వదేశంలోని తమవారికి ఫోన్ చేసి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.
తాజాగా ఏపీకి చెందిన ఓ మహిళ కూడా బిడ్డల భవిష్యత్ బాగుండాలని అనుకుంది. ఉద్యోగం చేస్తే నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబానికి అండగా ఉండొచ్చని ఆశపడింది. అందుకోసం అందరినీ వదిలి పరాయి దేశానికి వెళ్లింది. కానీ అక్కడ ఆమె ఆశలు అడియాశలుగా మారాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలానికి చెందిన హసీనా బీ, హసన్ వల్లి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి అబ్దుల్లా, అబ్దుల్లా వాజీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Annamayya Woman Viral Video : హసీనా బీ తమ సమీప బంధువుల సహకారంతో కొద్దిరోజుల క్రితం బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. కొద్దికాలం సజావుగా సాగిన అనంతరం ఆ ఇంటి యజమానులు ఆమె ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు. దీంతో తన ఆవేదనను వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది