Anganwadis Services in Polling Centre:ఎన్నికలు జరుగుతుండగా అది వేసవి కాలంలో స్కూల్ లో పిల్లలు ఏంటని అంతా అనుంటున్నారు కదా ? ఇక్కడ కనిపిస్తున్నది స్కూల్ కాదు, పోలింగ్ కేంద్రం. పిల్లలతో వచ్చిన తల్లులు గంటల తరబడి క్యూలైన్లో నిల్చొని ఓటు వేయడం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో అధికారులు చేసిన ఏర్పాటు. ఓటు వేసే సమయంలో తమతో వచ్చిన పిల్లలను చూసుకోవడానికి ఎన్నికల అధికారులు వినుత్న ప్రయత్నం. అందులో భాగంగా చిత్తురూలోని బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేయడానికి వచ్చిన వారి పిల్లల పర్యవేక్షణ బాధ్యతలు అంగన్వాడీలకు అప్పగించారు ఎన్నికల అధికారులు.
ఓట్లు వేయడాకి వచ్చిన తల్లుల పిల్లలు, తమ తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు, చిత్తూరు జిల్లాలో అధికారులు ఈ రంకమైన ఏర్పాటు చేశారు. పిల్లలకు ఆటవస్తువులు ఇచ్చి వారిని అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా చేయడం ద్వారా పిల్లలతో వచ్చిన తల్లిండ్రులు క్యూ లైన్ చూసి వెనుదిరిగే అవకాశం తగ్గుతుందనే, ఈ ఏర్పాట్లు చేసినట్లు ధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన పిల్లలు సైతం ఉత్సాహంగా కనిపించారు. అంగన్వాడిలతో ఇట్టే కలిసిపోయారు. వారికి ఆటబొమ్మలను ఇచ్చి అంగన్వాడీలు ఆటలు ఆడిపించే ప్రయత్నం చేశారు. మరి కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రుల ఫోన్లను తీసుకొని, ఆ ఫోన్లలో వీడియో గెమ్స్ ఆడుతూ కనిపించారు.