AP 10th Class Results 2024 Today : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఈ రోజు విజయవాడలో ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, https://results.bse.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
పదోతరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 3473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30 వరకు జరిగాయి. మొత్తం 6,54,000ల మంది పరీక్ష రుసుము చెల్లించారు. వీరిలో 6,23,000ల మంది పరీక్షలకు హాజరయ్యారు. 1,02,000ల మంది ప్రైవేట్‌గా పరీక్ష రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8న ముగించారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఫలితాలు విడుదల చేయనున్నారు.
SSC భారీ నోటిఫికేషన్ - ఇంటర్ అర్హతతో 3712 పోస్టులు భర్తీ! - SSC Jobs 2024
AndhraPradesh SSC Result : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోతరగతి సమయంలో ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేసింది. ప్రథమ, రెండో భాషా ప్రశ్నా పత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు జరిగాయి. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు తప్పలేదు. ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్ పేపర్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వెల్లడించింది. సైన్స్ ప్రశ్నపత్రం నమూనా కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. ఆంగ్లం, గణితం, సోషల్ స్టడీస్ పేపర్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
మరోవైపు పరీక్ష ఫలితాల అనంతరం పిల్లల మార్కులు బేరీజు వేసుకుని పై చదువులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యా నిపుణులు అంటున్నారు. అలాగే తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయ్యామని మనస్తాపానికి గురై విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని సూచించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారు సప్లిమెంటరీతో మళ్లీ మార్కులు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. కనుక పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా తల్లిదండ్రులు వారికి అండగా ఉండాలని, అలాగే వారి మానసిక స్థితిని అంచనా వేస్తూ ఉండాలని విద్యానిపుణలు సూచిస్తున్నారు.
విద్యార్థులారా బీ రెడీ - ఈనెల 24న ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - TELANGANA INTER RESULTS DATE 2024
SSC భారీ నోటిఫికేషన్ - ఇంటర్ అర్హతతో 3712 పోస్టులు భర్తీ! - SSC Jobs 2024