Andhra Pradesh Ministers Take Charge: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతికశాఖ మంత్రిగా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తొలి ఫైలుపై సంతకం చేశారు. ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్, అనంతరం తన స్థానంలో ఆసీనులై రెండు దస్త్రాలపై సంతంకం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి సంతకం చేశారు.
గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై రెండో సంతకం చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన సీనియర్ నేత నాగబాబు, పిఠాపురం తెలుగుదేశం నేత వర్మ, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు డిప్యూటీ సీఎంను అభినందించారు.
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు - పలు దస్త్రాలపై సంతకాలు - Pawan Kalyan Charge as Deputy CM
Home Minister Vangalapudi Anitha: వంగలపూడి అనిత హోంమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్-2లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. దిశ పోలీసుస్టేషన్ల పేరు మారుస్తామని స్పష్టంచేశారు. ప్రజలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలని.. పాత ప్రభుత్వ ఆలోచనల్లో ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని, బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా పరిగణిస్తామని అనిత తెలిపారు.