AP ECET Exam Results 2024 :పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్-2024 విడుదల అయ్యాయి. అనంతపురం జేఎన్‌టీయూలో ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు ఫలితాలని విడుదల చేశారు. ఏపీ ఈసెట్ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత ఇలా ఉండగా బాలికలు 93.34 శాతం, బాలురు 89.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 8న ఈ పరీక్షలు జరగ్గా రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం https://results.eenadupratibha.net/లో చెక్‌చేసుకోండి.
ఏపీఈసెట్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్‌లో బాలికలదే హవా - AP ECET Exam Results 2024 - AP ECET EXAM RESULTS 2024
AP ECET Exam Results 2024 : ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈసెట్-2024 ఫలితాలు వచ్చేశాయి. ఇవాళ ఉదయం అనంతపురం జేఎన్టీయూలో ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.
![ఏపీఈసెట్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్‌లో బాలికలదే హవా - AP ECET Exam Results 2024 AP ECET Exam Results 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-05-2024/1200-675-21592692-thumbnail-16x9-ap-ecet-results-2024.jpg)
Published : May 30, 2024, 11:56 AM IST
|Updated : May 30, 2024, 1:45 PM IST
ఐసెట్ ఫలితాలు :ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2024 ఫలితాలు సైతం ఈ రోజు (మే 30) సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
CBSE 10, 12వ తరగతి ఫలితాలు విడుదల- మళ్లీ అమ్మాయిలే టాప్ - CBSE Class 12 results