AP CM Chandrababu Innovative Idea :రహదారుల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణను అప్పగించే యోచన చేస్తున్నట్లుగా చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
మెరుగైన రహదారులే లక్ష్యం :'గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయి. రోడ్ల మరమ్మతులకు 850 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. జనవరిలో పండుగల సందర్భంగా రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలనే లక్ష్యంతో, దృఢ సంకల్పంతో ముందుకుపోతున్నాం. మన దగ్గర(ఏపీ) డబ్బుల్లేవు ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్నే మారుస్తుంది' అని చంద్రబాబు తెలిపారు.