- పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి: విష్ణుకుమార్‌రాజు
- అవినీతి రహిత, నేర రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి: విష్ణుకుమార్‌రాజు
- గంజాయి స్మగ్లింగ్, విపరీతంగా దోపిడీలు జరిగాయి: విష్ణుకుమార్‌రాజు
- పోలీసు సిబ్బంది కొరతను అధిగమించాలి: విష్ణుకుమార్‌రాజు
AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు - కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు - AP Assembly Session
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 9:24 AM IST
|Updated : Jul 23, 2024, 10:07 AM IST
Andhra Pradesh Assembly Sessions Live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నేడు అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అదే విధంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ చర్చించనున్నారు.
LIVE FEED
పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి: విష్ణుకుమార్‌రాజు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం: మంత్రి లోకేశ్
- గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడుపై ప్రభుత్వం విచారణ జరుపుతుంది: లోకేశ్
- గతంలో పనులు ఎందుకు సరిగా జరగలేదు.. నాసిరకం పనులపై విచారణ: లోకేశ్
- ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం: మంత్రి లోకేశ్
- ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం: లోకేశ్
- మెగా డీఎస్సీ అందుకే వేశాం.. ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతాం: లోకేశ్
- గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టింది: లోకేశ్
- గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతింది: లోకేశ్
- తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్నీ చేస్తాం: లోకేశ్
శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
- శాసనసభ రెండోరోజు సమావేశాలు
- శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
- శాసనసభ్యులకు ఇంకా సీట్లు కేటాయించలేదని ప్రకటించిన స్పీకర్
- మంత్రులకు మొదటి రెండు వరుసల్లో సీట్లు కేటాయించామన్న స్పీకర్
- సమావేశాలకు హాజరుకాని జగన్, వైకాపా శాసనసభ్యులు
నేడు రెండోరోజు శాసనమండలి సమావేశాలు
- నేడు రెండోరోజు శాసనమండలి సమావేశాలు
- గవర్నర్ ప్రసంగంపై మండలిలో ధన్యవాదాల తీర్మానంపై చర్చ
- ధన్యవాదాల తీర్మానంపై మండలిలో చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు
- తీర్మానాన్ని బలపరచనున్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
- ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న మంత్రులు
నేడు శాసనసభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- నేడు శాసనసభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- సభ ముందుకు వైద్యారోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు
- గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టనున్న కాలవ శ్రీనివాసులు
- ధన్యవాదాల తీర్మానంపై సభలో సభ్యుల ప్రసంగం
- గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానానికి జవాబివ్వనున్న సీఎం చంద్రబాబు