ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రియల్ లైఫ్​లోనూ మహేష్ బాబు సూపర్ స్టారే- చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు - FREE HEART OPERATIONS BY MAHESHBABU - FREE HEART OPERATIONS BY MAHESHBABU

Free Heart Operations for Children in Visakha: విశాఖలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించాలని ఆంధ్ర హాస్పిటల్స్ నిర్ణయించింది. ఈ మేరకు మూడు రోజులు ఉచితంగా చికిత్స అందించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, పలు స్వచ్చంద సంస్థలు సంయుక్త భాగస్వామ్యంలో ఈ గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.

Free_Heart_Operations_for_Children_in_Visakha
Free_Heart_Operations_for_Children_in_Visakha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 7:33 PM IST

Updated : Aug 6, 2024, 8:55 PM IST

Free Heart Operations for Children in Visakha: చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు విశాఖలో నిర్వహించాలని ఆంధ్ర హాస్పిటల్స్‌ నిర్ణయించింది. యూరప్‌కు చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ సహకారంతో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఉచిత క్యాంపు నిర్వహించనున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలను నిర్వహిస్తోంది. అయితే తొలిసారిగా విశాఖలో ఉన్న ఆంధ్ర హాస్పిటల్​లో ఉత్తరాంధ్రలోని చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ప్రవాసాంధ్రుడైన డాక్టర్ రమణ దన్నపనేని నేతృత్వంలో ఖరీదైన శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు.

FREE HEART OPERATIONS BY MAHESH BABU: విజయవాడలో ఇప్పటి వరకు 29 క్యాంపులు నిర్వహించిన ఆంధ్ర హాస్పిటల్స్‌ ఇప్పుడు 30వ క్యాంపును విశాఖలో ఏర్పాటు చేశారు. సినీ నటుడు సూపర్ స్టార్ మహేశ్​ బాబు, వారి కుటుంబ సభ్యులు, ఇతర స్వచ్చంద సంస్థల సహకారంతో ఈ ఉచిత హృదయ శస్త్ర చికిత్సలు అందిస్తున్నట్లు ఆంధ్ర హాస్పిటల్ వైద్య బృందం చెప్తోంది. ఈ ఉచిత గుండె శస్త్ర చికిత్సల శిబిరాలను త్వరలోనే మహేశ్ బాబు స్వయంగా వచ్చి వీక్షిస్తారని తెలిపారు.

అలర్ట్ : మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - గుండెపోటుకు దారితీయొచ్చు!

చిన్నారులకు కొత్త జీవితానిచ్చే బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నందుకు విదేశాల నుంచి వచ్చిన వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్న పిల్లల గుండె జబ్బులు మీద ప్రజలకు మరింత అవగాహన అవసరమని, 98 శాతం సక్సెస్ రేట్​తో శస్త్ర చికిత్సలు విజయవంతం అవున్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు 4 వేల ఆపరేషన్స్ విజయవంతంగా చేశామని ఆంధ్ర హాస్పిటల్స్ వైద్య బృందం చెప్తోంది. గుండె చికిత్సలు చేయించాలంటే లక్షల రూపాయలు ఖర్చుపెట్టాలని, అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్య సేవలు చేసి తమ బిడ్డల ప్రాణాలను కాపాడుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సినీ నటుడు మహేష్ బాబు ఆర్ధిక సహకారంతో జరుగుతున్న ఈ ఉచిత గుండె శస్త్ర చికిత్సల శిబిరాలను త్వరలోనే మహేష్ బాబు స్వయంగా వచ్చి వీక్షిస్తారని విశాఖ ఆంధ్ర హాస్పిటల్స్ వైద్యధికారులు తెలిపారు.

"విశాఖలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించాలని ఆంధ్ర హాస్పిటల్స్ నిర్ణయించింది. విజయవాడలో ఇప్పటి వరకు 29 క్యాంపులు నిర్వహించిన ఆంధ్ర హాస్పిటల్స్‌.. ఇప్పుడు తొలిసారిగా 30వ క్యాంపును విశాఖలో ఏర్పాటు చేసింది. యూరప్‌కు చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ సహకారంతో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఉచిత క్యాంపు ఏర్పాటు చేశాం. చిన్నారులకు కొత్త జీవితానిచ్చే బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది." - వైద్యులు

ఈ లక్షణాలున్నాయా - గుండెపోటు రాబోతున్నట్టే!

Last Updated : Aug 6, 2024, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details