Rain Drops in PVR Theatre : హైదరాబాద్ పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం నీరు పడింది. కల్కీ మూవీని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు అకస్మాత్తుగా థియేటర్ పై కప్పు నుంచి నీటి చుక్కలు పడ్డాయి. బయట వర్షం పడుతుంటే థియేటర్లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
థియేటర్లో వర్షం నీరు పడుతుంటే నిర్వాహకులు మాత్రం షో నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ మూవీ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యాలతో గొడవకు దిగారు.