ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంధ్య థియేటర్​ ఘటన - అల్లు అర్జున్ టీమ్ ఏం చెప్పిందంటే! - ALLU ARJUN TEAM ON SANDHYA INCIDENT

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్ - చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందజేస్తామని వెల్లడి.

allu_arjun_team_on_sandhya_incident
allu_arjun_team_on_sandhya_incident (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 3:28 PM IST

Allu Arjun Team Responded On Sandhya Theatre Incident :అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప ది రూల్‌’ (Pushpa 2 The Rule) ప్రీమియర్‌ షోలో భాగంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్​లోని సంధ్య థియేటర్‌ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందించింది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమని తెలిపింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. తమ బృందం బాధిత కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది.

అలాంటి వార్తలు ప్రసారం చేయకండి :మరోవైపు తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 78 గంటలు గడిస్తే గానీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా, పలు యూట్యూబ్ ఛానళ్లలో బాలుడు చనిపోయినట్టు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంతో కుటుంబసభ్యులు అలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని కోరుతున్నారు.

అల్లు అర్జున్‌ను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డ అభిమానులు :పుష్ప-2 బెనిఫిట్‌ షో కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన అల్లు అర్జున్‌ రాగా ఆయన్ని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రేవతి(35), ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి తొక్కిసలాటలో జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. వారు కిండ పడిపోవడం గమనించిన పోలీసులు వెంటనే వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్​ చేశారు. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.

'పుష్ప-2' బెనిఫిట్‌ షోకి వెళ్తే ప్రాణం పోయింది - సంధ్య థియేటర్‌ వద్ద మహిళ మృతి

జాతర ఎపిసోడ్‌కు ఫుల్ విజిల్స్!- ఫ్యాన్స్​ రియాక్షన్​కు బన్నీ రిప్లై ఇదే!

ABOUT THE AUTHOR

...view details