Allu Arjun Reaction About Sandhya Theatre Stampede:థియేటర్ తనకు గుడిలాంటిదని అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉందని హీరో అల్లు అర్జున్ అన్నారు. పోలీసులు, అధికారులు అందరూ కష్టపడి పనిచేసినా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి అన్నారు. తన వ్యవహారశైలిపై వచ్చిన వార్తలను అల్లు అర్జున్ ఖండించారు. తన క్యారెక్టర్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నారు.
పోలీసులు ఎవరూ జరిగినదాని గురించి చెప్పలేదు: తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని అల్లు అల్లు అర్జున్ అన్నారు. తాను ఎలాంటి ర్యాలీ చేయలేదని థియేటర్ కొద్ది దూరంలో కారు ఆగిపోయిందని తెలిపారు. అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో కారు ముందుకు కదల్లేని పరిస్థితి ఉందని ఆ సమయంలో చేయి చూపిస్తూ ముందుకు కదలండని అంటేనే నేను బయటకు వచ్చి, చేతులు ఊపానని వివరించారు. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత పోలీసులు ఎవరూ కూడా లోపలికి వచ్చి జరిగిన ఘటన గురించి చెప్పలేదని అన్నారు. థియేటర్ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెబితేనే నా కుటుంబంతో కలిసి బయటకు వచ్చేశానని అన్నారు.
వద్దు అనడం వల్లే హాస్పటల్‌కి వెళ్లలేదు: తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకూ కూడా నాకు తెలియదని అల్లు అర్జున్ వెల్లడించారు. మహిళ చనిపోయిన ఘటన తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను నాకూ పిల్లలు ఉన్నారు కదా అని అన్నారు. మరుసటి రోజు విషయం తెలిసిన తర్వాత బన్నీ వాసుకు ఫోన్ చేసి ఆస్పత్రికి వెళ్లమని చెప్పానని, తరువాత నేను కూడా హాస్పటల్‌కి వెళ్దామని సిద్ధమయ్యానని అన్నారు. కానీ బన్నీ వాసు నాపై కేసు నమోదు చేశారని చెప్పాడని నా లీగల్ టీమ్ కూడా వద్దని వెళ్లవద్దని చెప్పిందని వివరించారు. అందుకే నేను థియేటర్‌కు వెళ్లలేదని అల్లు అర్జున్ అన్నారు.
'ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం' - సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు